Homecinemaబేబి బంప్‌తో నిత్యా మీన‌న్ ..ప్రెగ్నెంట్ లుక్ లో క్యూట్ గా..

బేబి బంప్‌తో నిత్యా మీన‌న్ ..ప్రెగ్నెంట్ లుక్ లో క్యూట్ గా..

Telugu Flash News

కొద్ది రోజులుగా సౌతిండియన్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీన‌న్ ప్రెగ్నెన్సీ న్యూస్ సెన్సేషన్ అవుతోంది. టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల జ‌రుగుతున్న కొన్ని సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు లేదంటే సినిమాల ప్ర‌మోష‌న్ కోసం వారు వేసే కొన్ని ఎత్తుగ‌డ‌లు ఇండ‌స్ట్రీతో పాటు అభిమానుల‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సాధార‌ణంగా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఇట్టే హాట్ టాపిక్ గా మారుతుంది. అలాంటిది వాళ్ల ఎఫైర్లు లాంటి వార్తలు ఏ రేంజ్‌లో సంచలనం అవుతుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

2010లో విడుదలైన ‘అలా మొదలైంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిత్యా మీనన్ క్యూట్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఈ అమ్మడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీస్తూ తనకంటూ సినీ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది అనే చెప్పాలి. చివ‌రిగా భీమ్లా నాయ‌క్ చిత్రంలో ప‌వ‌న్ భార్య‌గా న‌టించి అల‌రించింది. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిత్యా మీన‌న్… ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని అప్లోడ్ చేయ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. అస‌లు పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావ‌డం ఏంట‌ని ముక్కున వేలేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

అయితే ఇదంతా తాను న‌టించిన వెబ్ సిరీస్ కోసం అని తాజాగా అర్ధ‌మైంది. తాజాగా బేబి బంప్‌తో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ…‘ప్రెగ్నెంట్ లుక్ అనుకున్నంత ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ నోరా పాత్ర చేయడాన్ని చాలా ఆస్వాదించాను. వండర్ ఉమెన్ సెట్స్ లో తీసిన ఫోటోలు ఇంకా అప్‌లోడ్ చేస్తాను. నోట్… నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు అంటూ త‌న ప్రెగ్నెన్సీ లుక్‌పై ఓ క్లారిటీ ఇచ్చింది నిత్యా. కాగా, ఈ అమ్మ‌డు వండర్ ఉమెన్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఇది జీ 5లో నవంబర్ 18 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో నిత్యా మీనన్ ప్రెగ్నెంట్ ఉమెన్ గా నటించినట్లు తెలుస్తుండ‌గా, ఆ సిరీస్ కి ప్రచారం కల్పించడం కోసం ప్రెగ్నెంట్ గెటప్ లో దర్శనమిచ్చి అంద‌రిని అయోమంలో ప‌డేసింది.

also read news:

Bigg Boss Telugu Season 6 : బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఫైమా..

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News