Telugu Flash News

నిఖిల్ ఇంటర్వ్యూ : నాకు గాడ్ ఫాదర్ ఎవ్వరూ లేరు..అందుకే..

యంగ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో నిఖిల్ ఈ మద్య విడుదల అయిన కార్తికేయ 2 సినిమాతో హిట్ కొట్టాడు.కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని మంచి సినిమాలు చేస్తున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో ఫేమస్ అయ్యాడు నిఖిల్. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు నిఖిల్. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సక్సెస్‌లు సాధిస్తున్నాడు .

ఇటీవల విడుదలైన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. చందుమొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ రెండో భాగం ఇది. కృష్ణతత్వం బోధిస్తూ లోకాన్ని రక్షించడానికి ఒక కడియం సాదించడమే ఈ మూవీ లోని పాయింట్. ఆద్యంతం అద్బుతం గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా , అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటించాడు.

సినిమా సక్సెస్‌పై దూసుకుపోతున్న నిఖిల్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు .సినిమా అభిమానులకు చేరువ కావాలంటే కథే ముఖ్యమని నిఖిల్ అన్నారు. సినిమాలో నటించేందుకు చాలా కష్టపడ్డాను.

నాకు ఒక గాడ్‌ఫాదర్‌ ఉంటే నాకెలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి నటుడిగా మారడం నాకు పెద్ద విజయం. ఇప్పుడున్న అభిమానుల సందడి చూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీడేస్‌’ రోజులు గుర్తొస్తున్నాయి’ అని నిఖిల్ భావోద్వేగానికి లోనయ్యాడు.

హ్యాపీడేస్ తర్వాత ఆరు సినిమాలు చేశాను, ఎలాంటి కథలు ఎంచుకోవాలో ఎవరూ చెప్పలేదు. వరుస పరాజయాల తర్వాత స్వామిరారా సినిమాతో హిట్ కొట్టాను.. అప్పుడే కథకు ప్రాధాన్యత ఉందని అర్థమైందని నిఖిల్ అన్నారు.

మరిన్ని చదవండి 

Megastar ‘Godfather’ digital rights for Amazon Prime ?

Interesting update from Naga Chaitanya’s Telugu-Tamil film

త్వర త్వరగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ షూటింగ్‌..!

 

Exit mobile version