HomecinemaNiharika: విడాకుల ప్ర‌చారం నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన నిహారిక‌

Niharika: విడాకుల ప్ర‌చారం నేప‌థ్యంలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన నిహారిక‌

Telugu Flash News

Niharika: గత రెండు రోజులుగా నటుడు నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు నెట్టింట ఎంత హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. నిహారిక, వెంకట చైతన్య సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో అవ్వ‌డం, నిహా భ‌ర్త‌ వెంకట చైతన్య పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయ‌డంతో ఇద్ద‌రి విడాకుల‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ ప్ర‌చారాల నేప‌థ్యంలో నిహారిక మొదటిసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. అయితే ఆ పోస్ట్ విడాకుల వార్తలకు సంబంధించింది కాదు, త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమో త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ నిహారిక నిర్మించి, నటిస్తున్నట్లు తెలుస్తుంది.. అయితే విడాకుల వార్తలపై ఆమె స్పందిస్తుంద‌ని అనుకుంటే, ఇలా ప్రోమో వీడియో షేర్ చేయ‌డంతో స‌స్పెన్స్ అలానే కంటిన్యూ అవుతుంది.

నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న విష‌యం విదిత‌మే.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News