Naveen Murder Case : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యువకుడు నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో కీలకంగా మారిన ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, విచారణకు సహకరించని ఆమెను సఖి కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రాలేదని పోలీసులు చెప్పారు. తాజాగా ఈ కేసులో నోరు విప్పిన నిహారిక.. సంచలన విషయాలను బహిర్గతం చేసింది.
నవీన్ తనకు దూరమయ్యాక హరిహర కృష్ణ తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని.. నవీన్ తనతో మాట్లాడటం హరిహరకృష్ణకు నచ్చలేదని నిహారిక చెప్పింది. ఈ క్రమంలోనే ఓసారి నవీన్‌ను మర్డర్ చేసేసి నిన్ను కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్తానంటూ చెప్పాడని నిహారిక వెల్లడించింది. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావని తాను అడిగితే.. సరదాగా అన్నానని చెప్పాడని తెలిపింది.
నవీన్‌ను చంపడానికి రెడీ
అనంతరం హరి ఊరికే సరదాకి అలా అన్నానంటూ తనతో చెప్పాడని తెలిపింది. జనవరి 15న హరిహరకృష్ణ తనకు ఫోన్ చేసి స్నేహితులంతా గెట్ టు గెదర్ పార్టీ చేసుకుంటున్నామని, జనవరి 16వ తేదీన కలుస్తామన్నాడని తెలిపింది. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడని, కానీ ఆ పార్టీ రద్దు చేసుకున్నామంటూ తర్వాతి రోజు తనకు హరి ఫోన్ ద్వారా చెప్పాడని నిహారిక పేర్కొంది.
ఫిబ్రవరి 17 న ఉదయం 9:40 గంటలకి నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ చేశాడని నిహారిక చెప్పింది. అనంతరం కొద్దిసేపటికే హరి తనకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడని తెలిపింది. నవీన్ కాల్ చేస్తే తాను వేరే వాళ్లతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడని తెలిపింది. నేను కూడా నవీన్ తో అదే విషయం చెప్పానని.. ఎందుకు అలా చేస్తున్నావని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశానని తెలిపింది. అనంతరం హరి తనకు ఫోన్ చేసి నవీన్ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడని, దీంతో తాను సరేనని చెప్పానంది.
ఇక మరుసటి ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 8 గంటలకు హరి తనను కలవాలని మెసేజ్ చేశాడని నిహారిక చెప్పింది. శివరాత్రి రోజు ఉదయం 9.30 గంటలకు వనస్థలిపురం నాగార్జున పాఠశాల పక్కన ఉన్న గల్లీలో రోడ్డుపై కలిసినట్లు తెలిపింది.
నవీన్‌ని చంపేశానంటూ హరి..
హసన్‌తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్‌ని వారి ఇంటికి దూరంగా.. చెట్లలో పడేశానంటూ తనతో చెప్పాడని నిహారిక వెల్లడించింది. తాను అతనితో ఎందుకు అలా చేసినావు.. వేరేలా మాట్లాడుకోవచ్చు కదా అని అన్నానని.. తర్వాత హరి వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగాడని తెలిపింది.
అందుకు తాను ఒప్పుకొని హరికి రూ.1,500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పానంది. ఇక ఈ విషయం గురించి నవీన్ స్నేహితులకు గానీ, పోలీసులకు గానీ చెప్పలేదని నిహారిక పేర్కొంది. తర్వాత ఫిబ్రవరి 20న తాను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో హరి తనకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్టాప్‌లో కలిశాడని తెలిపింది.
కాసేపు మాట్లాడిన తర్వాత నవీన్‌ను చంపిన చోటుకు తీసుకెళ్లాడని, బండిపై బీఎన్ రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ వద్ద చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేశానని చూపించాడంది. అక్కడి నుంచి రాజీవ్ గృహకల్ప వద్ద బ్యాగు పడేసిన ప్రాంతాన్ని, అటు తర్వాత బ్రాహ్మణపల్లి వద్ద ఒక కంపెనీ పక్కన నవీన్ తలను, అతని ప్యాంటు, కత్తిని, సెల్‌ఫోన్ పడేసిన స్థలాన్ని చూపించాడంది. అనంతరం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్‌లో అమృత ఫ్యామిలీ డాబాలో తాను, హరి ఇద్దరం సాయంత్రం నాలుగున్నర గంటలకు బిర్యానీ తిన్నామని తెలిపింది.తర్వాత తనను ఇంటి వద్ద దింపేశాడని తెలిపింది.
ఇక నవీన్ వాళ్ల స్నేహితుడు ఫోన్ చేసి నవీన్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది.. నిన్న హైదరాబాద్‌కి వాళ్ల ఇంటర్ ఫ్రెండ్ కలవడానికి వచ్చాడని.. నీకేమైనా తెలుసా అని అడిగాడంది. తనకేం తెలియదని చెప్పానని.. అయినప్పటికీ మళ్లీ ఫోన్ చేసి మీ కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారట కదా.. అతని ఫోన్ నంబర్ కావాలని అడగడంతో హరి నంబర్ మెసేజ్ చేశానని తెలిపింది.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఇక ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకు నవీన్ వాళ్ల మామ హరికి ఫోన్ చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దాం రమ్మని తనను పిలిచాడని హరి తనతో చెప్పాడని నిహారిక తెలిపింది. అప్పుడే తన ఫోన్‌ను హరి స్విచ్చాఫ్ చేస్తానని తనతో చెప్పాడంది.
ఏదైనా ఉంటే హసన్‌తో టచ్‌లో ఉండాలంటూ హరి తనతో చెప్పాడంది. తర్వాత తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి వెళ్లిపోయాడని, అదే రోజు సాయంత్రం మళ్లీ తరుణ్ తనకు కాల్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిసిందా? అని అడిగాడంది. అప్పుడు కూడా తనకేమీ తెలియదని చెప్పానంది.
నవీన్ వాళ్ల మామ కూడా తనకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పాలని అడిగాడని నిహారిక తెలిపింది. ఆ సమయంలో తనకు భయం వేసి తన బావ భూపాల్‌రెడ్డికి నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడని, తన స్నేహితులు ఫోన్ చేస్తున్నారని చెప్పానంది. ఆ సమయంలో తన బావ భూపాల్‌రెడ్డి తన ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడాడంది.
తాను అడ్వొకేట్ అని, పదే పదే నిహారికకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దంటూ తన బావ ఫోన్‌లో చెప్పాడని నిహారిక చెప్పింది. ఇక ఫిబ్రవరి 23న తాను హసన్‌కు కాల్ చేశానని, హరి మిస్సయ్యాడని, వాళ్ల అక్క, బావ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పానని నిహారిక తెలిపింది.
ఇన్‌స్టాలో మెసేజ్ డిలీట్
ఈ క్రమంలోనే తనను పోలీసులు పిలుస్తున్నారని, వెళ్తున్నట్లు హసన్ చెప్పాడంది. నిన్ను కూడా పిలుస్తారని, ఫోన్‌లో ఛాటింగ్, మెసేజ్‌లు ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోవాలని హసన్ సూచించాడంది. అప్పుడు తాను కొంత చాట్‌ను, ఇన్‌స్టాలో మెసేజ్‌లను డిలీట్ చేశానని నిహారిక చెప్పింది.
ఫిబ్రవరి 24న తన ఫ్రెండ్‌కి హసన్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చిందని నిహారిక తెలిపింది. నిహారికని ఎవరికీ ఫోన్ చేయవద్దు.. ఎవరితో మాట్లాడవద్దు.. హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదని చెప్పాలంటూ తన ఫ్రెండ్ కి హసన్ మెసేజ్ చేశాడని నిహారిక తెలిపింది.
తన ఫ్రెండ్ ఫోన్ చేసి కూడా ఇదే విషయం చెప్పిందని తెలిపింది. అనంతరం ఉదయం 8:30 గంటలకు తాను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్సు దగ్గర నిలబడి ఉన్నాడని తెలిపింది. తన ఫ్రెండ్ హరిని చూసి తనకు చెప్పిందని తెలిపింది. వెంటనే తాను బస్సు దిగి వెళ్లి హరితో కాసేపు మాట్లాడానంది.
తాను పోలీసులకు లొంగిపోతాననని హరి తనతో చెప్పాడని నిహారిక తెలిపింది. హరి తన ఫోన్ నుంచి హసన్ కి ఫోన్ చేసి బ్రాహ్మణపల్లి గేట్ దగ్గరికు రమ్మని చెప్పి తన దగ్గర నుంచి వెళ్లిపోయాడంది. అనంతరం తనకు హరి మధ్యాహ్నం ఒంటి గంటకు కాల్ చేసి హస్తినాపురం బస్టాప్ వద్ద ఉండమంటే తాను అక్కడ వెయిట్ చేశానంది.
హరి వచ్చి తనను కలిశాడని, నవీన్ తల, అతని భాగాలు, బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వేయి… లేదంటే మాపైన కూడా అనుమానం వస్తుంది… అని హసన్ చెప్పాడని హరి తనతో చెప్పాడంది.
ఇక హరి, హసన్ ఇద్దరూ కలిసి రాజీవ్ గృహకల్ప వెనుక పడేసిన బ్యాగు వద్దకు వెళ్లి ఇద్దరూ బ్యాగును తీసుకొని తిరిగి బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కంపెనీ వద్దకు వెళ్లారని నిహారిక తెలిపింది. అక్కడ నవీన్ కుళ్లిపోయిన తలను, హసన్ ఖాళీ ప్లాస్టిక్ సంచిలో పడేసి రమ్మని చెప్పాడంది.
పోలీసులకు లొంగిపోవాలని..
అనంతరం సంచిని, నవీన్ అవయవాలతో ఉన్న బ్యాగును హరి ఒక్కడే తీసుకొని బండి మీద వెళ్లి నవీన్‌ను హత్య చేసిన ప్రాంతంలో పడేశాడని నిహారిక తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన బైక్ దుర్వాసన వస్తోందని, సాయిబాబా గుడి వద్ద ఉన్న సర్వీసింగ్ సెంటర్‌లో ఇచ్చచానని హరి తనతో చెప్పాడని నిహారిక వెల్లడించింది. తర్వాత ఇద్దరం కలిసి తమ ఇంటికి వెళ్లామని, తన ఇంట్లోనే హరి స్నానం చేశాడని తెలిపింది.
Also Read:
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు.. న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయన్న కవిత
heat stroke : వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఎలా?
RRR: కవలలు సైతం ఇలా చేయలేరంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై గరికపాటి ప్రశంసలు
samyuktha menon Latest stills, Images, Photos 2023