Niharika konidela: కొద్ది రోజులుగా నిహారిక, చైతన్య విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు సాగుతున్న విషయం తెలిసిందే. వెంకట చైతన్య తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలతో పాటు విందులు, విహారాలతో పాటు నిహా జ్ఞాపకాలకు సంబంధించిన ఆనవాళ్లు తుడిచి వేయడంతో పాటు నిహారికను అన్ ఫాలో చేశాడు. దీంతో ఇద్దరు విడిపోనున్నారనే ప్రచారం సాగింది.
Horoscope (11-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
అయితే మొన్నటి వరకు చైతన్య మాత్రమే అన్ని ఫొటోలు డిలీట్ చేయగా, తాజాగా నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి డిలీట్ చేసింది. విడాకుల ఊహాగానాలు మొదలైన ఇరవై రోజుల తర్వాత నిహారిక పెళ్లి ఫోటోలు అకౌంట్ నుండి డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వెంకట చైతన్య జ్ఞాపకాలు నిహారిక పూర్తిగా చెరిపేసినప్పటికీ ఆయనతో పెళ్లికి సంబంధించిన రెండు పోస్ట్స్ మాత్రం ఆమె తొలగించలేదు.
samyuktha menon Latest stills, Images, Photos 2023
ఒకటి నిశ్చితార్థం రోజు దిగిన ఫోటో కాగా,ఆ రోజు వాళ్ళ అమ్మ నిశ్చితార్థం చీర నిహారిక కట్టుకుంది. ఆ చీరలో నిహారిక అమ్మ ఉన్న ఫోటోను తన ఫోటోను పక్కపక్కనే పెట్టి పోస్ట్ చేసింది.. ఈ ఫోటో నిహారిక అలానే ఉంచింది. అలాగే పెళ్లి పందిరిలో వెంకట చైతన్య పక్కన కూర్చుని ఉన్న ఫోటో సైతం నిహారిక డిలీట్ చేయలేదు.