Niharika Konidela : నిన్న (శుక్రవారం) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే , తన అన్న వరుణ్ తేజ్ ఎంగేజిమెంట్ లో నీహారిక తెగ సందడి చేసిందని తను పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే తెలుస్తుంది.
అన్న వరుణ్ లవ్ స్టోరీ గురించి చెల్లికి ఎప్పటి నుండో తెలిసే ఉంటుంది.. అందుకే పోస్ట్ లో .. ఈ రోజు కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నా! అని చెప్తూ.. వెల్‌కమ్ వదినా.. అంటూ ముగించింది.
ఇంకా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంటకు తమ ఆశీస్సులను అందించారు. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత కొణిదెల, శ్రీజ సహా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
read more :