Niharika: ఇటీవల సెలబ్రిటీల వరుస బ్రేకప్స్ అభిమానులని ఎంతో ఆందోళనకి గురి చేస్తున్నాయి. సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకున్న తర్వాత చాలా మంది ప్రముఖులు తమ వైవాహిక బంధానికి బ్రేకప్ చెప్పారు.
శ్రీజ- కళ్యాణ్ దేవ్ కూడా విడిపోయినట్టు కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది. ఇక ఇప్పుడు నిహారిక- చైతన్య బంధానికి కూడా బీటలు వారినట్టు ప్రచారం నడుస్తుంది. నిహారిక.. మూడేళ్ల క్రితం చైతన్యజొన్నలగడ్డని వివాహం చేసుకోగా, వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.
మూడేళ్ల పాటు అన్యోన్యంగానే ఉన్న నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పార్థాలు వచ్చాయని, దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు సోషల్ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్ ఫాలో కావడం అందరిలో అనుమానాలు రెట్టింపు చేసింది.
ఇక చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన పెళ్లిఫోటోలను కూడా డిలీట్ చేశారు. నిహారికతో ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేకుండా డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరు కూడా విడిపోయారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
also read :
Kriti Sanon: అందుకే హీరోయిన్స్ కి త్వరగా పెళ్లిళ్లు కావు.. కృతి సనన్ ఆసక్తికర కామెంట్స్
Malavika Mohanan Latest Stills, Images,Instagram Photos 2023