Telugu Flash News

Rewind 2022 : ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన కొత్త హీరోయిన్లు.. ఎవరు ? ఏ సినిమాలు ?

Rewind 2022 : ప్రతి ఏడాది తెలుగు సినీ పరిశ్రమలోకి చాలా మంది కొత్త కొత్త హీరోయిన్లు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటారు.అలా ఈ ఏడాది ఎవరెవరు వచ్చారో..ఏ సినిమాలతో వచ్చారో ఒకసారి చూద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో బాలీవుడ్ బామ ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ తెలుగు ప్రేక్షులకు పరిచయమై అందర్నీ ఆకట్టుకున్నారు.

బాలీవుడ్ బామ ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్

అదే విధంగా “భీమ్లా నాయక్” సినిమాలో రానా భార్యగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంయుక్త మీనన్ ఆ సినిమా విడుదల కాకముందే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తెలుగులో మాట్లాడి మార్కులు కొట్టేసింది.

సంయుక్త మీనన్

అయితే ఆమె అభినయం నచ్చడంతో సితారా ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ధనుష్ హీరోగా నిర్మిస్తున్న “సార్” సినిమాలో అవకాశం ఇచ్చారట.

ఇక దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన “సీతా రామం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరో అందాల చందమామ మృణాల్ ఠాకూర్.తెలుగులో ఇది ఆమెకు తొలి సినిమానే అయినప్పటికీ కేవలం తన అందంతోనే కాకుండా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే నటనతో అందర్నీ మెప్పించి వారి మనసులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది.

మృణాల్ ఠాకూర్

మెగా ఫ్యామిలీ కి చెందిన వరుణ్ తేజ్ “గని” సినిమాతో తొలి సారిగా తెలుగు తెరపై కనిపించిన సాయీ మంజ్రేకర్ ఆ సినిమాతో ప్రేక్షకులకు అంతగా ఎక్కకపోయినప్పటికీ అడవి శేష్ నటించిన “మేజర్” సినిమాతో అందరి కళ్ళలో పడి అభినందనలు అందుకుంది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా వచ్చిన “లైగర్” సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అనన్యా పాండే పర్లేదనిపించుకుంది.

విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించిన “ఓరి దేవుడా” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మిథిలా పాల్కర్ తొలి సినిమాతోనే అందరి ఆదరణ పొందింది.

రామారావు అన్ డ్యూటీ తో రజిషా విజయన్,అశోక వనంలో అర్జున కళ్యాణం తో రితికా నాయక్,కృష్ణ వ్రింద విహారి తో షిర్లే సేటియా,గుర్తుందా శీతాకాలంతో కావ్యాశెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది తెలుగు సినిమాలలోకి వచ్చి మెరిసిన తారలు చాలా మందే ఉన్నారు.

అయితే ఈ ఏడాది వచ్చిన హీరోయిన్లు వచ్చే ఏడాదిలో కూడా కనిపిస్తారో….లేక వచ్చే ఏడాది ఇంకొంత మంది తారలు పరిచయమౌతారో… చూడాలి మరి.

also read news: 

america weather today : మంచుతుఫాన్‌.. మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. క్రిస్మస్‌ వేడుకలకు ఆటంకం

మధుమేహంతో బాధపడుతున్న వారు బంగాళాదుంపలు తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?

moral stories in telugu : కోపిష్టి బ్రాహ్మణుడు – బుద్ధుడు

 

Exit mobile version