HomesportsSania Mirza: షో కోస‌మే విడాకుల నాట‌క‌మా.. సానియా, షోయ‌బ్‌ల‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Sania Mirza: షో కోస‌మే విడాకుల నాట‌క‌మా.. సానియా, షోయ‌బ్‌ల‌ని తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Sania Mirza: గ‌త కొద్ది రోజులుగా షోయ‌బ్ మాలిక్, సానియా మీర్జాల విడాకుల వ్య‌వ‌హారం ఎంత పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరు విడిపోవ‌డం ఖాయమ‌ని, ఎవ‌రైన వారిద్ద‌రు విడిపోకుండా చూస్తే బాగుండ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెట్టారు. అస‌లు ఈ విడాకుల వ్య‌వహారం తెర‌పైకి రావ‌డానికి కార‌ణం సానియా తన కొడుకు ఇజాన్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు అని కామెంట్ పెట్టింది. ఆ తర్వాత ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’అని మరో పోస్ట్ షేర్ చేయ‌గా, సానియా నిజంగా బాధ‌ల‌లో ఉన్న‌ట్టుంది, త‌న భ‌ర్త నుండి విడిపోవ‌డం ఖాయం అంటూ కొంద‌రు ప్ర‌చారాలు చేశారు.

మ‌రీ ఇంత దారుణ‌మా?

షోయబ్ మాలిక్ పాకిస్థాన్ మోడల్ అయేషా ఒమర్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఇది తెలిసి సానియా మీర్జా విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందని అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. ‘సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు. సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తియిపోయాయి.’ అంటూ మాలిక్ మేనేజర్ కామెంట్ చేశాడంటూ కూడా ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే ఇవ‌న్నీ ఉట్టి ప్ర‌చారాలేన‌ని ఓ టీవీ టాక్ షో ప్రమోషన్స్ కోసం ఈ జోడీ ఈ విడాకుల నాటకం ఆడినట్లు అర్ధ‌మైంది. ఉర్దూ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి ‘ది మీర్జా మాలిక్ షో అనే షో చేస్తున్నారు. దీని కోసం అలాంటి డ్రామా ఆడిన‌ట్టు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by UrduFlix (@urduflixofficial)

టాక్ షోకి క్రేజ్ తెచ్చేందుకు చేసిన మార్కెటింగ్ ఎత్తుగడగా దీనిని కొంద‌రు ప‌రిగణిస్తున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర ఆగ్రహానికి గురైన నెటిజన్లు సానియా జోడీపై మండిపడుతున్నారు. ఓ టీవీ షో కోసం ఇంత దిగజారాలా? అని కొంద‌రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సరిహద్దులు ధాటి ప్రేమించుకున్న సానియా-మాలిక్ 2010లో ఇరు కుటుంబాల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజాన్ మీర్జా జన్మించగా, బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు టెన్నిస్‌కి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, కొడుకుతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని చాలా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

also read news:

Krishna: వెండితెర‌పై ప్ర‌యోగాలకి కేరాఫ్ కృష్ణ‌.. టాలీవుడ్‌లో త‌న‌దైన ముద్ర వేసిన సూప‌ర్ స్టార్

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News