Homebigg boss telugu season 6Bigg Boss Telugu 6 : బిగ్ షాక్.. ఆఖ‌రి నిమిషంలో ఇన‌యాని సేవ్‌ చేసి ఆ యాంక‌రమ్మ‌ని ఎలిమినేట్ చేశారా..!

Bigg Boss Telugu 6 : బిగ్ షాక్.. ఆఖ‌రి నిమిషంలో ఇన‌యాని సేవ్‌ చేసి ఆ యాంక‌రమ్మ‌ని ఎలిమినేట్ చేశారా..!

Telugu Flash News

Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న‌గేమ్ షో బిగ్ బాస్. ఈ షో ప్ర‌స్తుతం తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. రోజురోజుకి గేమ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుండ‌గా, ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

అయితే ప్ర‌స్తుతం హౌస్‏లో ఒకరిద్దరు తప్ప మిగతా బ్యాచ్ మొత్తం తిన్నామా.. ప‌డుకున్నామా తెల్లారిందిగా అన్నట్టుగా ఉన్నారు. ప్ర‌తి వారం నాగార్జున క్లాస్‌లు తీసుకుంటున్నా కూడా కొంద‌రిలో అయితే మార్పు రావడం లేదు. ఈ క్ర‌మంలో ఇన‌య ఈ వారం ఎలిమినేట్ అయిందంటూ ఓ ప్రచారం జ‌రిగింది.

ఇన‌య సేఫ్‌.. నేహా ఔట్

ముందు నుంచి వాసంతి ఎలిమినేట్ అవుతుందని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, చివరి నిమిషంలో ఇనయ ఎలిమినేట్ అయ్యిందనే న్యూస్ వ‌చ్చింది. ఇన‌య ఎలిమినేట్ అవుతుంద‌నే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు.

మ‌గాళ్ల‌తో స‌మానంగా ఇన‌య పోటీ ప‌డ‌గా, ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ కొంద‌రు మండిప‌డ్డారు. మిగిలిన అమ్మాయిలతో పోల్చుకుంటే కెప్టెన్సీ టాస్క్‌లో ఒంటరిపోరాటం చేసి ఒళ్లు హూనం చేసుకుని గేమ్ ఆడింది. ఇక శ్రీహాన్, గీతులతో జరిగిన గొడవలో గ‌ట్టిగా వాదించింది. అమ్మాయిల‌లో మిగ‌తా వారి క‌న్నా కూడా ఇన‌య ప‌ర్‌ఫార్మెన్స్ బాగానే ఇస్తుంది.

దీంతో ఆమెకు ఓటింగ్ శాతం పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం ఇనయ సేఫ్ ప్లేస్‏లోనే ఉందని..ఇనయను ఎలా చేస్తారంటూ నెట్టింట కామెంట్స్ చేయ‌డంతో, ఎలిమినేషన్‏లో ట్విస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం.

లేటేస్ట్ టాక్ ప్రకారం ఇనయ కాకుండా నేహ ఎలిమినేట్ అయినట్లుగా కొన్ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఆట త‌క్కువ న‌స ఎక్కువ అన్న‌ట్టుగా నేహా ప‌రిస్థితి మారింది. అందుకే ఆమెను ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు పంపించార‌ని టాక్. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది మ‌రి కొద్ది గంట‌ల‌లో తేల‌నుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News