HomesportsPakistan: ఇంగ్లండ్ టీం ఉన్న హోట‌ల్ స‌మీపంలో కాల్పులు.. ఇక భార‌త్ టూర్ పూర్తిగా ర‌ద్దు..!

Pakistan: ఇంగ్లండ్ టీం ఉన్న హోట‌ల్ స‌మీపంలో కాల్పులు.. ఇక భార‌త్ టూర్ పూర్తిగా ర‌ద్దు..!

Telugu Flash News

Pakistan: ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు పాక్ టూర్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. . పాక్‌ -ఇంగ్లాండ్‌ మధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న ఈ ఘటన అంద‌రిలో అలజడి సృష్టించింది. రెండో టెస్టు నిమిత్తం ముల్తాన్‌‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టు.. అక్కడ ఓ హోటల్‌లో దిగ‌గా, ఆ హోటల్‌కు సమీపంలో గురువారం కాల్పుల శబ్దం వినిపించినట్లు పాక్ మీడియాలో వార్తా కథనాలు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. లోకల్ గ్యాంగ్స్ మధ్య ఈ కాల్పులు జరిగాయని వార్తా కథనాల స‌మాచారం.

గతంలో పాక్ పర్యటనకు వచ్చిన శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం ఆ దేశంలో పర్యటించేందుకు ఇతర జట్లు ఏ మాత్రం ముందుకురాలేదు. చాలా కాలం తర్వాత తిరిగి శ్రీలంక జట్టే మళ్లీ ఆ దేశంలో అడుగుపెట్ట‌గా, అనంత‌రం 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డమీద టెస్టు క్రికెట్ ఆడేందుకు గత నెలలో ఇంగ్లాండ్ జట్టు అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగించింది. అయితే, పాక్‌‌లో పర్యటించే జట్లకు భారీ భదత్ర కల్పిస్తున్నామని అక్కడి అధికారులు తెలిపిన కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

2023లో పాకిస్తాన్లో జరిగే ఆసియాకప్ కోసం టీమిండియా రాకుంటే..2023లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్లో పాక్ ఆడదన్న పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా వ్యాఖ్యలు ఇటీవ‌ల సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దానికి కౌంట‌ర్‌గా ఏది ఏమైనా పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశాడు స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. కానీ వరల్డ్ కప్ ఆడేందుకు పాక్ భారత్కు రావాల్సిందేన‌ని, టీమిండియా ఆసియాకప్ కోసం పాక్కు వెళ్లకపోతే ఆ దేశానికి భారీ నష్టం అన్నాడు. అయితే ఇప్పుడు ఈ పేలుళ్ల త‌ర్వాత భార‌త్‌.. పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌డం ఇక క‌ల‌లో కూడా జ‌ర‌గ‌ద‌నే చెప్పాలి, ఇన్నాళ్లు భార‌త్‌ని ఆసియా క‌ప్ కోసం పాక్ పంపించే చిన్న ఆలోచ‌న ఉన్న పేలుళ్ల త‌ర్వాత ఇక ఆ నిర్ణ‌యం అస్స‌లు తీసుకోరు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News