Telugu Flash News

న‌య‌న‌తార ప‌బ్లిక్‌లో షారూఖ్‌కి ఇలా ముద్దు పెట్టేసిందేంటి?

Shah_Rukh_Khan_Nayanthara

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కొద్ది రోజుల క్రితం త‌ను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం గ‌డుపుతున్న విషం తెలిసిందే. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌లో న‌టిస్తూ అల‌రిస్తుంది. నయనతార నటిస్తున్న బాలీవుడ్ చిత్రం జవాన్. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ జవాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా షారుక్ చెన్నై రాగా, మర్యాదపూర్వకంగా షారుక్ నయనతార ఇంటికి వెళ్ళాడు. అనంతరం తిరిగి వెళుతుండగా నయనతార కారులో కూర్చున్న షారుక్ ఖాన్ బుగ్గపై ముద్దు పెట్టింది.

పబ్లిక్ లో నయనతార ఓ హీరోని ఇలా కిస్ చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఆన్ స్క్రీన్ పై ఇవ్వన్నీ ఓకె కాని ఆఫ్ స్క్రీన్ లో జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పెళ్లైన న‌య‌న‌తార ప‌బ్లిక్‌లో ఇలా షారుక్ ఖాన్ కి మర్యాదపూర్వకంగా పెట్టిన ముద్దు కూడా వార్తలకు ఎక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. జవాన్ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక రోల్స్ చేస్తుండ‌గా, దీపికా పదుకొనె క్యామియో రోల్ లో మెరవనున్నారు. జవాన్ మూవీ జూన్ 6న విడుదల కానుంది.

also read:

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే బెండకాయ.. ఇలా వాడండి..

Cashew Nuts : పాలలో జీడిపప్పు నానబెట్టి తింటే ఈ రోగాలు మాయం

 

Exit mobile version