HomecinemaNayanthara : నయనతార సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిందా.. కారణమేంటి ?

Nayanthara : నయనతార సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిందా.. కారణమేంటి ?

Telugu Flash News

Nayanthara :సినిమా ప‌రిశ్ర‌మ‌లో సుమారు 20 ఏళ్లుగా అలరిస్తోన్న అగ్రకథానాయిక నయనతార. వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. 2003లో విడుదలైన మలయాళ మువీతో ‘మనస్సినాక్కేర్’ తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నయన్‌ తమిళ, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఎన్నో బ్లాక్‌ బాస్టర్ చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. ఇక భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను 2021లో ప్రారంభించింది న‌య‌న‌తార‌.

దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయనతార‌కి మంచి పేరు ఉంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న స్టేజ్‌లో నయన్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. గ‌త ఏడాది అక్టోబర్‌లో ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేప‌థ్యంలో తన పిల్లల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన న‌య‌న‌తార కొంత కాలం సినిమాల‌కి బ్రేక్ ఇవ్వాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ ప్రస్తుతం నయన్‌ చేతిలో అయితే పలు భారీ ప్రాజెక్టులున్నాయి.

also read :

Kriti Sanon Hot Photo Gallery Collection, Images, Stills

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News