Telugu Flash News

Naveen Murder Case : నవీన్‌ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. హరిహరకృష్ణ ఏమేం చేశాడంటే..

naveen and harihara krishna

naveen and harihara krishna

Naveen Murder Case : హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, నవీన్‌ అనే యువకుడి హత్యోదంతంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తన ప్రియురాలితో చనువుగా ఉంటున్న నవీన్‌ను.. పక్కా ప్లాన్ ప్రకారమే హరిహరకృష్ణ అనే యువకుడు హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య జరిగిన తర్వాత 8 రోజుల పాటు ఏం చేశాడనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు. నల్గొండ మహాత్మాగాంధీ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న నవీన్‌ను ఈనెల 17వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసరాల్లో హరిహరకృష్ణ అనే యువకుడు హత్య చేసిన విషయం తెలిసిందే.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా సిరిసినగండ్లకు చెందిన నవీన్‌ను హత్య చేసిన తర్వాత మరుసటి రోజు కూడా హరిహరకృష్ణ అనే యువకుడు ఘటనాస్థలానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తన ప్రేయసి తనకు దక్కదనే అక్కసుతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు వెల్లడించాడు.

హత్య తర్వాత వారి ఫ్రెండ్స్‌, యువతికి సంబంధించిన కాల్‌ రికార్డులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు నవీన్‌, హరిహరకృష్ణ వెళ్లిన రూట్లలో సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలించారు.

నాగోల్‌లో ఆగి ఫాస్ట్‌పుడ్‌ తీసుకున్నట్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో లిక్కర్‌ తీసుకున్నట్లు సీసీ కెమెరాలలో నమోదైంది. హత్య తర్వాత నిందితుడు ఎక్కడెక్కడికి వెళ్లాడనే అంశంపై ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

సుమారు రెండు నెలల ముందు నుంచే నవీన్‌ను మట్టుబెట్టాలని హరిహరకృష్ణ ప్లాన్‌ చేసినట్లు విచారణలో తేలింది. మర్డర్‌ చేసేందుకు కావాల్సిన కత్తిని దుకాణం నుంచి కొనుగోలు చేసినట్లు తేల్చారు.

హత్య తర్వాత ఏమీ ఎరుగనట్లు.. ఓఆర్ఆర్ వద్ద వదిలేశానని అందరికీ ఫోన్లలో చెబుతూ వచ్చాడు. తర్వాత స్వస్థలం వెళ్లి రెండు రోజులు గడిపినట్లు తెలుస్తోంది.

అయితే 24న తన తండ్రికి ఈ విషయం హరిహరకృష్ణ చెప్పడంతో.. వెంటనే పోలీసులకు అప్పగించినట్లు హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ హత్య తన కుమారుడి ఒక్కడి పనే అయి ఉండకపోవచ్చని, మరెవరైనా ప్లాన్‌ చేసి ఉండొచ్చన్నారు. తన కుమారుడికి శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు.

also read :

Actress Pooja Hegde Hot at Zee Cine Awards 2023 Event

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

Exit mobile version