Telugu Flash News

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో కీలక పరిణామం.. జైలుకు ప్రియురాలు నిహారిక!

naveen and harihara krishna

Naveen Murder Case Latest update : హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకున్న నవీన్‌ హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. నవీన్‌ హత్య వెనుక ప్రియురాలు నిహారిక పాత్ర ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ కోసం నిహారికను అరెస్టు చేశారు పోలీసులు. ఆమెకు కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది. అనంతరం నిహారికను చంచల్‌గూడ కారాగారానికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్‌ హత్య కేసులో ప్రియురాలి పాత్రను మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించని నిహారిక పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తే ఆత్మహత్య చేసుకోడానికి కూడా వెనుకాడబోనని నిహారిక బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను సఖి కౌన్సెలింగ్‌ కేంద్రానికి తరలించారు. కౌన్సెలింగ్‌ అనంతరం కూడా ఆమె వైఖరిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక ఆమె వాట్సాప్‌ ఛాటింగ్‌లను పోలీసులు రిట్రీవ్‌ చేశారు. ఈ హత్యలో నిహారిక పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేశారు.

హరిహర కృష్ణకు సహకరించిన హసన్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. నవీన్‌ హత్య కేసులో హరిహరకృష్ణ ఏ1గా ఉన్నాడు. ఏ2 ఏ3లుగా నిహారిక, హసన్‌లను పోలీసులు చేర్చారు. ఈ మేరకు హయత్‌ నగర్‌ కోర్టులో నిందితులను హాజరు పరిచారు. వీరికి కోర్టు రెండు వారాల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో నిహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. హరిహరకృష్ణకు హసన్‌ స్నేహితుడు. ఇక నిహారిక అటు హత్యకు గురైన నవీన్‌తోనూ, ఇటు హరిహరకృష్ణతోనూ లవ్‌ ట్రాక్‌ నడిపిందని విచారణలో తేలింది.

నవీన్‌ హత్య గురించి ప్రియురాలు నిహారికకు ముందే తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత హరిహరకృష్ణ.. ప్రియురాలు నిహారికతో విషయాన్ని చెప్పడంతో ఆమె గుడ్‌ బాయ్.. అంటూ మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనీ ట్రాన్జాక్షన్స్‌ కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత ప్రియురాలి ఇంటికి వెళ్లిన హరిహరకృష్ణ.. అక్కడే స్నానం చేశాడు. పోలీసులకు దొరక్కుండా ఆమె ఫోన్లో వాట్సాప్‌, కాల్‌ డేటా డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో నిహారిక పాత్ర ఉందని తేల్చిన పోలీసులు.. కేసులో ఏం జరిగిందనే పూర్తి వివరాలు రాబట్టేందుకు ఆమెను అరెస్టు చేశారు.

also read :

Mahesh Babu: మ‌హేష్, రాజ‌మౌళి చిత్రం ఇంగ్లీష్‌లో కూడా.. ఇది నిజమా ?

kitchen tips in telugu : 10 వంటింటి చిట్కాలు (07-03-2023)

Shubman Gill : ర‌ష్మిక‌పై క్రష్ ఉందన్న యువ క్రికెట‌ర్

Health Tips in telugu : ఈ 10 ఆరోగ్య చిట్కాలు మీ కోసం (07-03-2023)

Exit mobile version