చెక్కిళ్ళు..అందమైన చెక్కిళ్ళు..అద్దాల మెరుపులు సొంతం కావాలా … మరింకెందుకు ఆలస్యం ?
- స్నానం చేసేముందు ఆలివ్ ఆయిల్ తో మర్దన చేస్తే చెక్కిళ్లు ఎంతో మృదువుగా తయారవుతాయి.
- ఎండలో తిరిగి బుగ్గలు కమిలిపోతే వాటికి పెరుగు లేదా మీగడ రాస్తే నున్నగా, నాజూకుగా అవుతాయి.
- బుగ్గలు లోతుగా ఉంటే వీలయినన్నిసార్లు నోటినిండా గాలి పీల్చి, బుగ్గలను ఉబ్బించి మళ్ళీ గాలిని బయటకు వదలాలి. అప్పుడు మీ బుగ్గలు బూరెలే!
- బంగాళాదుంపను చక్రాల్లా కోసి వాటిని ముఖానికి పావుగంటసేపు రుద్ది, అరగంటసేపు ఆరనిచ్చి, గోరు వెచ్చని నీటితో సబ్బును ఉపయోగించకుండా శనగ పిండితో రుద్ది ముఖాన్ని కడిగితే చాలు ఎంత జిడ్డుగా ఉన్న చెక్కిళ్ళయినా శుభ్రంగా తయారవటమే కాకుండా ఎప్పుడూ మీ చెక్కిళ్ళు ఫ్రెష్ గానే కనిపిస్తాయి.
-Advertisement-