HomenationalElections: సార్వత్రిక ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్‌ సిబ్బంది నియామకంపై మార్గదర్శకాలు

Elections: సార్వత్రిక ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్‌ సిబ్బంది నియామకంపై మార్గదర్శకాలు

Telugu Flash News

Elections: వచ్చే ఏడాది 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2024లోపు తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సంసిద్ధమవుతున్నారు. ఏర్పాట్లు చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం తీరుతెన్నులను నిర్దేశిస్తూ తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈసీ.

ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ సిబ్బంది, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ ఆఫీసర్స్ తదితరులకు సూచనలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నికల్లో పాల్గొనే ఇతర సిబ్బందితో పాటు నోటిషికేషన్‌ విడుదల అయినప్పటి నుంచి రిజల్ట్స్‌ వెలువడే దాకా ఈసీకి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులుగానే పరిగణిస్తారు. దీంతో అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధి, పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈసీ కీలక సూచనలు చేసింది.

జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారులు తమ పరిధిలోని అర్హులైన పోలింగ్‌ సిబ్బంది సమాచారాన్ని ఎలక్ట్రానిక్ నమూనాలో సిద్ధం చేసి కంప్యూటర్‌లో ర్యాండమైజేషన్‌కు సిద్ధంగా ఉంచుకోవాలని ఈసీ సూచించింది. డేటాబేస్‌లో నేమ్‌, జెండర్‌, డిజిగ్నేషన్‌, నివాస స్థలం, వర్కింగ్‌ ప్లేస్‌, సొంత అసెంబ్లీ నియోజకవర్గం లాంటి వివరాలన్నీ పొందుపరచాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక పోలింగ్‌ సిబ్బందిగా నియమించడానికి వీలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల లిస్టును డేటాబేస్‌లో సపరేట్‌గా ఉంచాలని ఈసీ స్పష్టంచేసింది.

ఏదైనా అభ్యర్థితోకానీ, పార్టీతోకానీ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలను నివారించడానికి పలు శాఖలు, వేర్వేరు కార్యాలయాల నుంచి తీసుకున్న సిబ్బందిని తగిన విధంగా కలగలపాలని ఈసీ పేర్కొంది. అలాగే సీనియారిటీ, జీతాలు, ర్యాంకులు, పోస్టు ఆధారంగా ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ ఆపీసర్లను విభజించాలని పేర్కొంది. గెజిటెడ్‌ ఆఫీసర్లను ప్రిసైడింగ్‌ అధికారులుగా నియమించడం వీలు కాకపోతే సూపర్‌వైజరీ కెపాసిటీతో పని చేసే ఆఫీసర్లను మాత్రమే నియామకం చేయాలని స్పష్టం చేసింది. జిల్లాల వారీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల లిస్టును హోంశాఖకు చెందిన కంప్యూటరైజ్డ్‌ డేటాబేస్‌తో పోల్చుకొని చూడాలని సూచించింది.

Read Also : Uma Harathi: ఎన్నో ఓటములు చూశా.. గెలుపుగా మార్చుకున్నా.. సివిల్స్‌ మూడో ర్యాంకర్ ఉమా హారతి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News