Telugu Flash News

Sri Sri Sri Raja Vaaru : ఎన్టీఆర్ బావమరిది కథానాయకుడిగా అరంగేట్రం, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

narne nithin

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ Sri Sri Sri Raja Vaaru ‘ అనే ఫ్యామిలీ డ్రామాతో సినిమాల్లోకి అరంగేట్రం ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ రోజు శ్రీశ్రీశ్రీ రాజా వారు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఫుల్ హ్యాండ్ షర్ట్, జీన్స్ మరియు స్పోర్ట్స్ షూస్‌లో అతనిని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. నార్నే నితిన్ ఎన్టీఆర్ భార్య ప్రణతికి సోదరుడు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రంలో నితిన్ మాస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామ్‌రావు చింతపల్లి, ఎంఎస్‌ రెడ్డి సంయుక్తంగా ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’ చిత్రాన్ని నిర్మించారు. కైలాస్ మీనన్ సంగీతం సమకూర్చగా , దాము నర్రావుల సినిమాటోగ్రాఫర్‌గా మరియు ఎడిటర్‌గా రాజేష్ దాసరి పని చేస్తున్నారు.

మరిన్ని ఆసక్తికరమైన వార్తలు చదవండి :

‘భీమ్లా నాయక్’ సందడి షురూ.. మార్చి 25 న ఈ రెండు ఓటీటీల్లో..

స్పెయిన్ లో ప్రభాస్, ‘సాలార్’ గాయానికి శస్త్రచికిత్స?

janhvi kapoor:హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్

Samantha hot poses for critics choice film awards 2022

 

Exit mobile version