HomecinemaNaresh- Pavitra: ఎట్ట‌కేల‌కు ప‌విత్ర మెడ‌లో మూడు ముళ్లు వేసిన న‌రేష్‌..వైర‌ల్‌గా మారిన వీడియో

Naresh- Pavitra: ఎట్ట‌కేల‌కు ప‌విత్ర మెడ‌లో మూడు ముళ్లు వేసిన న‌రేష్‌..వైర‌ల్‌గా మారిన వీడియో

Telugu Flash News

Naresh- Pavitra: కొద్ది కాలంగా న‌రేష్‌-ప‌విత్ర‌ల పేర్లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. న్యూఈయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీడియో షేర్ చేస్తూ అనౌన్స్ చేయ‌గా, ఇప్పుడు అది నిజం చేశారు. కొద్ది మంది స‌న్నిహితులు, స్నేహితుల మ‌ధ్య న‌రేష్‌- ప‌విత్ర లోకేష్ ఏడ‌డుగులు వేశారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వీరు సాంప్రదాయ బద్ధంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో వీరి పెళ్లి ఎక్కడ జరిగిందేనది తెలియాల్సి ఉంది.

అయితే ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్ర‌క‌టించారు. అంతేకాదు చిన్న‌పాటి వీడియోని కూడా షేర్ చేశారు. వీడియోలో పెళ్లి దుస్తుల్లో మెరిసిన నరేష్, పవిత్రా పూజారి మంత్రోచ్ఛరణ మధ్య పవిత్రబంధంలో అడుగుపెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. కొత్త ప్రయాణంలో జీవితకాలం శాంతి , ఆనందం కోసం మీ దీవెనలు కోరుతున్నాను.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటున్న‌ట్టు న‌రేష్ తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

also read :

Kriti Sanon: అందుకే హీరోయిన్స్ కి త్వ‌ర‌గా పెళ్లిళ్లు కావు.. కృతి స‌న‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

RRR: విషం క‌క్కిన త‌మ్మారెడ్డికి నాగ‌బాబు, రాఘ‌వేంద్ర‌రావు కౌంట‌ర్స్

-Advertisement-

samyuktha menon Latest stills, Images, Photos 2023

Actress Honey Rose Latest pics, stills, photo gallery 2023

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News