HomecinemaNaresh-Pavithra : న‌రేష్- ప‌విత్ర లోకేష్ పెళ్లి విష‌యంలో వ‌చ్చిన క్లారిటీ.. దీని కోసమేనా ఇంత హంగామా..!

Naresh-Pavithra : న‌రేష్- ప‌విత్ర లోకేష్ పెళ్లి విష‌యంలో వ‌చ్చిన క్లారిటీ.. దీని కోసమేనా ఇంత హంగామా..!

Telugu Flash News

Naresh-Pavithra: సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్ర లోకేష్ పెళ్లికి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా లిప్ లాక్ వీడియో విడుద‌ల చేసిన న‌రేష్‌, ఆ త‌ర్వాత త‌మ‌కు పెళ్లి జ‌రిగిన‌ట్టు ఓ వీడియో విడుద‌ల చేశారు.

ఇదంతా చూసి వారు ఇద్ద‌రు నిజంగానే పెళ్లి చేసుకున్న‌ట్టు అంద‌రు భావించారు. అయితే అదంతా సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా చేసింద‌ని అర్ధ‌మైంది.

విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా మ‌ళ్లీ పెళ్లి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ ను అలాగే రిలీజ్ పైనా అప్డేట్ కూడా అందించారు మేకర్స్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కథ అందించడంతో పాటు డైరెక్ట్ చేస్తున్నారు.

ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సాంప్రదాయ దుస్తులలో నరేష్ – పవిత్రా లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థం అవుతోంది. చిత్రానికి న‌రేష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో వెరైటీ ప్ర‌మోష‌న్స్ చేప‌డ‌తున్న‌ట్టు తెలుస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News