HomecinemaOmkar:ఓంకార్ ముందు నానా ర‌చ్చ చేసిన న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌.. త‌గ్గ‌దే లే అంటున్నారుగా..!

Omkar:ఓంకార్ ముందు నానా ర‌చ్చ చేసిన న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌.. త‌గ్గ‌దే లే అంటున్నారుగా..!

Telugu Flash News

Omkar: న‌రేష్‌, ప‌విత్ర లోకేష్.. ఈ ఇద్ద‌రు లేటు వ‌య‌సులో ఘాటు స‌ర‌సాలు మొద‌లు పెట్టారు. ఆఫ్ స్క్రీన్‌లోనే కాదు ఆన్ స్క్రీన్‌లోను ర‌చ్చ చేస్తున్నారు. మీడియా ముందు కూడా వీరి ప్ర‌వ‌ర్త‌న కొంత హాట్ టాపిక్ అవుతుంది. గ‌త కొంత కాలంగా ఈ ఇద్ద‌రి రిలేష‌న్‌పై అంద‌రిలో ప‌లు అనుమానాలు ఉన్నప్ప‌టికీ ఇప్పుడైతే ఓ క్లారిటీ వ‌చ్చింది. వీరిద్ద‌రు ప్ర‌వ‌ర్తించే తీరుతో అంద‌రు ఓ నిర్ణ‌యానికి అయితే వ‌చ్చేసారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుండ‌గా, తమ రిలేషన్‌పై సినిమాని కూడా చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ ఇద్దరు చేసిన ర‌చ్చ అంతా ఇంతాకాదు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రు కలిసి `మళ్లీ పెళ్లి` సినిమా కూడా చేస్తున్నారు. ఇది నరేష్‌ లైఫ్‌ కోణంలో తెరకెక్కుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ, అటు తమ రిలేషన్‌షిప్‌ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఈ జంట ఓంకార్‌ హోస్ట్ గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోకి హాజ‌ర‌య్యారు.. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారని ఓంకార్ అడిగితే చాలా ఇంట్రెస్టింగ్ గా స‌మాధానం చెప్పారు నరేష్‌. ముద్దుగా తనని `అమ్ములు` అని పిలుచుకుంటాను అని చెప్పిన న‌రేష్‌.. ఇంకా ప్రేమ ఎక్కువైతే `అమ్ము` అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి `వద్దులే` అని వదిలేశాడు. ప్రస్తుతం మీ రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటని ఓంకార్‌ ప్రశ్నించగా, ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా, మేం కలిసి ఉంటామని త‌మ రిలేష‌న్‌పై క్లారిటీ ఇచ్చాడు.

ఇక వీరిద్ద‌రు క‌లిసి స్టేజ్‌పై డాన్సులు చేశారు. స్టేజ్‌పైనే నానా రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. మరో సందర్భంగా తుపాకి ఎక్కుపెట్టి కాల్చే సన్నివేశంలో ఓంకార్‌ మాట నమ్ముతావా? నా మాట నమ్ముతావా? అని నరేష్‌ ప్రశ్నించగా, మిమ్మల్నే నమ్ముతా అని చెప్పుకొచ్చింది పవిత్ర. అప్పుడు నరేష్‌ రియాక్ట్ నన్ను ఇలా న‌మ్ముతూ ఉండాల్సిందే. జీవితం అంతా నమ్ముతూనే ఉండాలి అని చెప్పడంలో అంద‌రికి మరో కోణం కనిపించింది. కానీ దాన్ని లెక్క చేయక పవిత్ర నరేష్‌తో సరదాగా గేమ్ ఆడి సంద‌డి చేసింది. అయితే వీరి హంగామా చూసిన కొంద‌రు ఈ ఏజ్‌లో ప్రేమేంటని? లేటు వయసులో ఘాటు ప్రేమ ఆపండ్రా బాబు మాకు సిగ్గేస్తోందని, ఎంతగా తెగించారు అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా, న‌రేష్ బాల‌న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా అల‌రించాడు. మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు ప‌విత్ర‌తో స‌హ‌జీవ‌నం ద్వారా హాట్ టాపిక్ అయ్యాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News