Telugu Flash News

pavitra naresh : త్వ‌ర‌లోనే మా పెళ్లి.. మా కోసమే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింద‌న్న న‌రేష్‌

pavitra naresh

pavitra naresh: సీనియర్ న‌టుడు న‌రేష్ పేరు ఇటీవలి కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. ఆయన సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే పవిత్ర లోకేష్‌తో చేసే ర‌చ్చ పీక్స్‌కి వెళ్లింది. న‌రేష్ తీరు చూసిన జనాలు షాక్ అవుతున్నార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

ఇప్పుడు ఆయన చేసే చర్యలు ఊహాతీతంగా అనిపిస్తున్నాయి.. లేటు వయసులో సహజీవనం చేస్తున్న ఆయన… తన జీవితంలోని వివాదాలను సినిమా రూపంలోకి తెస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. న‌రేష్ ప‌విత్ర లోకేష్ న‌టించి మ‌ళ్లీ పెళ్లి చిత్రం మే 26న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో వీరు చేసే ర‌చ్చ పీక్స్ లో ఉంది. అయితే న‌రేష్-పవిత్ర లోకేశ్ జోడీ ఇప్పుడు ఎక్కడ ఎలా కనిపించినా కూడా హాట్ టాపిక్ అవుతుంది.

క‌న్నడ ప్రెస్ మీట్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. నిజానికి పెళ్లి అనేది మాకు కచ్చితంగా అవసరం లేదు. చాలామంది ఇష్టం లేకుండా సమాజం కోసం పెళ్లి అనే బంధంతో ముడిపడి ఉన్నారు. వారి కోసమే ఈ సినిమా చేశాం. పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు అనేవి కాదు. అవి సంకేతాలు మాత్రమే.

పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం అన్న‌మాట‌. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు కానీ మా మనసులు మాత్రం కలిశాయి. అందుకే మేము కలిసి ఇంత హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని అన్నారు న‌రేష్‌.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా నా బయోపిక్ అని అందరు భావిస్తున్నారు. కాని ఇది నా బయోపిక్ కాదని తేల్చేసారు. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయోద్దు. సినిమా ప‌క్కాగా న‌చ్చుతుంది అని చెప్పుకొచ్చారు.

ఇక విడాకులపై సుప్రీం తీర్పు తనకు బూస్ట్‌ లాంటిదని అన్నాడు నరేష్‌. మా పెళ్లి కోసమే సుప్రీం తీర్పు ఇచ్చిందని.. కోర్టు తీర్పు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ న‌రేష్ తెలియ‌జేశారు.. గత ఏడాది కాలంగా న‌రేష్ స‌హ‌జీవ‌నం విష‌యంతోనే హాట్ టాపిక్‌గా మారుతున్నాడు.

నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడనే విష‌యం 2022 సంవ‌త్స‌రంలో బయటపడింది. కానీ గత నాలుగేళ్లుగా వీరిద్ద‌రు ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. కేవలం సన్నిహిత వర్గాలకు మాత్రమే ఈ సీక్రెట్‌ తెలుసు.

అయితే ప‌లు సంద‌ర్భాల‌లో వీరిద్ద‌రు క‌లిసి కనిపించ‌డంతో కొంద‌రు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని పూర్తి క్లారిటీ తెచ్చుకోలేక‌పోయారు. ఇప్పుడు మాత్రం న‌రేష్ త‌మ రిలేష‌న్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

also read :

Devara : దేవ‌ర టైటిల్ నాది… కొట్టేశారు అంటూ బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్

Exit mobile version