HomecinemaNaresh: ప‌విత్రా లోకేష్‌తో పెళ్లి గురించి న‌రేష్ ఏమ‌న్నాడంటే?

Naresh: ప‌విత్రా లోకేష్‌తో పెళ్లి గురించి న‌రేష్ ఏమ‌న్నాడంటే?

Telugu Flash News

Naresh: గ‌త కొద్ది రోజులుగా మీడియాలో న‌రేష్- ప‌విత్రాల వ్య‌వ‌హారం చాలా హ‌ట్ టాపిక్ అయింది. వీరి గురించి చాలా చ‌ర్చ‌లు న‌డిచాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్, పవిత్ర మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్ ఇచ్చారు. మూడవ భార్యపై ప్ర‌తీకారం తీర్చుకోవడానికే ఈ చిత్రం తెరకెక్కించారా అని ప్రశ్నించగా నరేష్ బ‌దులిస్తూ..రివేంజ్ తీర్చుకోవాలంటే కత్తులతో పొడవాలి లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి . అంతేకాని రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయం కదా అని చెప్పుకొచ్చాడు.

ఇక పెళ్లి గురించి కూడా ప్ర‌శ్న ఎదురు కాగా, దానికి స్పందించిన న‌రేష్.. మ్యారేజ్ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. అయితే ఇటీవ‌ల మ్యారేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా కుప్పకూలిపోయింది. ఫ్యామిలీ కోర్టులు ఎక్కువవుతున్నాయి. మ్యారేజ్ అంటే రెండు హృదయాలు కలవడం మాత్రమే అని నేను భావిస్తాను. ఆ రకంగా చూసుకుంటే నాకు, పవిత్రకి పెళ్లి అయిందో లేదో మీరే నిర్ణయించుకోండంటూ స‌స్పెన్స్ కి తెర‌దించాడు న‌రేష్‌. కొన్నాళ్లుగా తన మూడవ భార్య రమ్యరఘుపతితో విభేదాల కారణంగా ఆమెకి దూరంగా ఉంటూ వ‌స్తున్న న‌రేష్‌.. పవిత్ర లోకేష్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News