Telugu Flash News

Naresh and Pavitra : న‌రేష్‌- ప‌విత్ర విడిపోబోతున్నారా.. ట్విస్ట్ అదిరిందిగా..!

Naresh and Pavitra

Naresh and Pavitra : సీనియ‌ర్ న‌టుడు నరేష్ గతంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్ర‌స్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స‌త్తా చాటుతున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉన్న ఈయన.. నాలుగవ పెళ్లిగా పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోవాల‌నుకుంటున్నట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ వార్తలు వచ్చినప్పుడు అందరూ పుకార్లు మాత్రమే అని భావించారు. కానీ కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది.

ఇవన్నీ పక్కన పెడితే నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్ కి విడాకులు ఇచ్చే సమస్య లేదు అంటూ నానా రచ్చ చేస్తుంది.

అయితే రమ్య తన ఆస్తుల కోసం హత్య ప్రయత్నాలు చేస్తోందని.. హైదరాబాదు నుండి ఒక ముఠాను పిలిపించి త‌న‌పై దాడి కూడా చేయిస్తుంద‌ని న‌రేష్ ఆరోపణలు చేశారు.

అంతే కాదు కార‌వ్యాన్ అద్దాలను ఆ ముఠానే పగలగొట్టింది అంటూ కోర్టును ఆశ్రయించాడు నరేష్. ఈ త‌తంగం మ‌ధ్య‌లో నెటిజ‌న్స్ వీరిద్దరూ విడిపోవడానికి సిద్ధమ‌య్యార‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా రమ్య రఘుపతి ఇంతే పట్టుదలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరిద్దరూ విడిపోవాల్సి వ‌స్తుంద‌ని జోస్యాలు చెబుతున్నారు.

also read :

రుచిగా ఉన్నాయని ఈ ఆహారాలు లాగించేస్తున్నారా? జాగ్రత్త !

vastu shastra : ఏ రకమైన భూమి నివాస యోగ్యం ? ఎలా తెలుసుకోవాలి ?

Diabetes : షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోతే ఏం చేయాలి? తప్పక తెలుసుకోండి..

Exit mobile version