Bigg Boss: విదేశాలలో ప్రారంభమైన బిగ్ బాస్ షో మనదేశంలో మంచి ఆదరణ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ షోపై ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా కూడా నిర్వాహకులు సక్సెస్ ఫుల్గా షోని రన్ చేస్తూనే ఉన్నారు. అయితే తెలుగులో సక్సెస్ ఫుల్గా ఆరో సీజన్ కూడా రన్ అవుతుంది.
ఈ షోపై నారాయణ పదే పదే తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా షోని బ్యాన్ చేయాలి అంటూ ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోపై విమర్శలు చేస్తూ నాగార్జునపై కూడా విమర్శలు చేస్తున్నారు నారాయణ.
సంచలన కామెంట్స్..
నారాయణ తరచుగా బిగ్ బాస్ ని బ్రోతల్ హౌస్ తో పోల్చడం చూసాం. బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉండగా, ఈసారి కూడా ఆయన బిగ్ బాస్ లోకి వెళ్లే అమ్మాయిలు వ్యభిచారులంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు బిగ్ బాస్ అమ్మాయిలకు గుండు కొట్టించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం ఇటీవల నల్లొండలో జరిగిన ఘటన. ఇటీవల నల్గొండ జిల్లాలో వ్యభిచారులనే ముద్రవేసి ఇద్దరు మహిళలకు గుండు కొట్టించిన ఘటన వైరల్గా మారింది. ఈ ఘటనను ఖండించారు సీపీఐ నారాయణ.
వ్యభిచారులు అని గుండు కొట్టించామని అంటున్నారని, మరి బిగ్ బాస్ లో వాళ్లకు కూడా గుండ్లు కొట్టిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు నారయణ. బిగ్ బాస్ లో వాళ్లకు మాత్రం చప్పట్లు కొడతారు, సామాన్య మహిళలకు గుండ్లు కొడతారా ఇదెక్కడి పద్దతి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.
వ్యభిచారులనే పదాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో నిషేధించిందని, వారిని వ్యభిచారులనడం ముమ్మాటికీ తప్పేనంటున్నారు నారాయణ. అయితే నారాయణ బిగ్ బాస్ మహిళల్ని వ్యభిచారులంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది.