Nani: నేచురల్ స్టార్ నాని వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నాడు. కెరీర్‌లో విభిన్న కథా చిత్రాలు చేసిన నాని కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ రాకుండా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు.
స్పీడు, క్వాలిటీ రెండింటికి ప్రాధాన్యం ఇస్తున్న నాని నెక్స్ట్ చేయబోయే లైనప్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో దసరా మూవీ చేస్తుండగా, ఈ సినిమా మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక త్వరలో నాని తో శైలేష్ కొలనుతో హిట్ 3 సినిమాని ఓ రేంజ్‌లో తెరకెక్కించబోతున్నాడు. ఆ తర్వాత దర్శకుడు కం యాక్టర్ అవసరాల శ్రీనివాసరావు నాని తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. చూస్తుంటే నాని మాస్ లైనప్ కేక పెట్టించేలా ఉంది.
మరిన్ని వార్తలు చదవండి :
punishments in hell : నరకాలు – అక్కడ అనుభవించవలసిన శిక్షలు ఏంటో తెలుసుకోండి..
snacks for weight loss : ఆ స్నాక్స్ తింటే వెయిట్ లాస్ గ్యారెంటీ..