తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (KCR) టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత వేరే రాష్ట్రంలో తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు మహారాష్ట్రలోని నాందేడ్ (NANDED) వేదిక అవుతోంది. దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలనే తపనతో కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా రూపాంతరం చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఖమ్మంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, వామపక్ష పార్టీల జాతీయ నేతలు హాజరై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ నేడు జరుగుతోంది. రెండు వారాలుగా తెలంగాణ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి నాందేడ్‌లో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వెళ్లి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసిస్తున్న గ్రామాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ సభకు తరలి రావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు నేతలు. నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణలోని చెన్నూరు నుంచి బోధన్ నియోజకవర్గాల ఊళ్లకు మహారాష్ట్రలోని సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సరిహద్దు నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
నాందేడ్ సభలో పలువురు ఆ రాష్ట్ర నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరే ఉంది. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు చేరేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా నాందేడ్‌లోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం ప్రసంగిస్తారన్న దానిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకెళ్తున్నతరుణంలో మోదీ వైఫల్యాలు, ప్రైవేటీకరణ, అదానీ అంశం, దేశంలోని వనరులు సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, చైనా అంశం.. ఇలా కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
also read:
YCP MLA : కర్నూలుకు వ్యాపించిన అసంతృప్తి సెగ..
జైసల్మేర్‌కి చేరుకున్న కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా.. రేపే వివాహం..!