Nagma: రేసుగుర్రం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు రవి కిషన్. ఆయన ఒక్క తెలుగులోనే కాదు, హిందీ, భోజ్‌పూరీ భాషల్లోనూ ఆయన నటిస్తున్నారు. భోజ్‌పూరీ భాషలో ఏకంగా హీరోగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన హిందీలో పదుల సినిమాలు చేసి మంచి నటుడిగా ఎదిగాడు. అయితే భోజ్‌పూరీలో సినిమాలు చేసే సమయంలో రవి కిషన్ నగ్మాతో ప్రేమలో పడ్డాడనే పుకార్లు ఎక్కువగా వినిపించాయి.
ఆ పుకార్లపై తాజాగా దీనిపై నటుడు రవికిషన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ… నగ్మాతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్లు వచ్చాయని , తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. ఆమెతో కలిసి నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద హిట్ కావడం కారణంగానే ఇలాంటి పుకార్లు బయటకు వచ్చాయని రవికిషన్ అన్నాడు. నా భార్య ప్రీతి శుక్లాని నేను ఎంతో గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా అంటూ రవికిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
also read:
Special Story : ఆ ఊరంతా ఉద్యోగులే.. సత్తా చాటుతున్న బంజారా గ్రామం
Upasana : నేను అందంగా లేకపోయిన డబ్బుల కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు: ఉపాసన