HomecinemaNagarjuna | అఖిల్.. వాళ్ల అమ్మ‌ని చాలా ఇబ్బంది పెట్టాడు : నాగార్జున‌

Nagarjuna | అఖిల్.. వాళ్ల అమ్మ‌ని చాలా ఇబ్బంది పెట్టాడు : నాగార్జున‌

Telugu Flash News

Nagarjuna: అక్కినేని నాగార్జున వార‌సుడు అఖిల్ న‌టించిన ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వరంగల్‌లోని రంగలీలా మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున చీఫ్ గెస్ట్‌‌గా హాజ‌ర‌య్యారు.

ఆ స‌మ‌యంలో కొడుకు అఖిల్ గురించి మొదటిసారి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియ‌జేశారు.. కడుపులో ఉన్నపుడు అఖిల్ వాళ్ల అమ్మను ఎంతో ఇబ్బంది పెట్టాడని తెలిపాడు నాగ్ . అఖిల్‌కి 8 నెలల వయసులో ఉన్నపుడే విపరీతమైన ఎనర్జీ ఉండేదని.. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడని నాగార్జున అన్నాడు.

అఖిల్ ఎనర్జీ చూసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారని, అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని సూచించినట్లుగా నాగార్జున స్ప‌ష్టం చేశారు. ఇక ఏజెంట్ చిత్రంలో కూడా అఖిల్ ఎన‌ర్జీ మొత్తాన్ని సురేంద‌ర్ రెడ్డి బ‌య‌ట‌కు తీసారంటూ ఆయ‌న తెలియ‌జేశారు.

తాము యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సిక్స్ ప్యాక్‌లు లేవని.. దానికి నిజంగా థాంక్స్ చెప్పుకోవాల్సిందే అంటూ చిన్న జోక్ కూడా చేశారు నాగ్.

also read :

Horoscope (24-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News