Homebigg boss telugu season 6Bigg Boss 6: గీతూ చేసిన ప‌నికి శ్రీహాన్‌కి ప‌నిష్మెంట్‌.. ఒక్కొక్క‌రికి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన నాగార్జున‌

Bigg Boss 6: గీతూ చేసిన ప‌నికి శ్రీహాన్‌కి ప‌నిష్మెంట్‌.. ఒక్కొక్క‌రికి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన నాగార్జున‌

Telugu Flash News

Bigg Boss 6: శ‌నివారం వ‌చ్చిందంటే నాగార్జున హౌజ్‌మేట్స్‌కి చీవాట్లు పెట్ట‌డం కామన్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చీవాట్లు పెట్టిన కంటెస్టెంట్స్ లో మార్పు అనేది రావ‌డం లేదు.ఏ త‌ప్పు చేయోద్దు అంటే అదే త‌ప్పు చేస్తున్నారు .ఇక 63వ ఎపిసోడ్‌లో నాగార్జున హౌజ్‌మేట్స్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు. టాస్క్‌ల‌లో భాగంగా ఇంటి సభ్యులు చేసిన పొరపాట్లపై మాట్లాడాడు నాగ్‌. ఎవరి తప్పులేంటో చెబుతూ క్లాస్‌ పీకాడు. కెప్టెన్‌ అయిన శ్రీ సత్యకి అభినందనలు తెలిపిన నాగ్‌, ఆమె ఆట తీరుని అభినందిస్తూ ప్ర‌శంస‌లు కురిపించాడు.

గ‌ట్టి క్లాస్ ప‌డిందిగా…

అంతకు ముందు రెడ్‌ టీమ్‌, బ్లూ టీమ్‌లుగా సభ్యులు ఆడిన ఆట తీరుని చర్చిస్తూ, ర్యాంకింగ్ ఇవ్వాలని తెల‌ప‌గా, బ్లూ టీమ్ కెప్టెన్‌ ఆదిరెడ్డి తమ గ్రూప్‌ సభ్యులకు ప‌లు ర్యాంక్‌లు ఇచ్చాడు. రాజ్‌కి మొదటి ర్యాంక్‌, ఇనయకి రెండు, మెరీనాకి మూడు, వాసంతికి నాలుగు, బాలాదిత్యకి ఐదు, రోహిత్‌కి ఆరు, తనకు ఏడో ర్యాంక్ ఇచ్చారు. ఈ క్రమంలో నోరు జారి బూతులు వాడిన బాలాదిత్యకి గట్టిగా ఇచ్చాడు నాగ్‌. సిగ్గులేదా, నువ్వు మనిషివేనా, ఇంకా ఆయన ఆవేశంలో అన్న మాటలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు నాగార్జున‌.

ఒక్క సిగ‌రెట్ కోసం గీతూని అన్ని మాట‌లు అనడం క‌రెక్టేనా అంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు. నాగ్ ఇచ్చిన క్లాస్‌కి బాలాదిత్య ఇక బిగ్ బాస్ హౌజ్‌లో మ‌ళ్లీ సిగ‌రెట్ కాల్చ‌న‌ని ప్రామిస్ చేశాడు. ఇక బ‌లహీన‌త‌ల‌తో గీతూ ఆడుకుంటున్న నేప‌థ్యంలో ఆమెకి క్లాస్ పీకాడు.

టీమ్‌ లీడర్‌గా ఆదిరెడ్డి అద్భుతంగా ఆడాడంటూ ప్రశంసించారు నాగ్‌. ఇక రెడ్‌ టీమ్‌ లీడర్‌ గీతూ కూడా తమ సభ్యులకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. శ్రీహాన్ కి మొదటి ర్యాంక్‌, ఫైమాకి రెండు, శ్రీసత్యాకి మూడు, రేవంత్‌కి నాలుగు, తనకు ఐదు, కీర్తికి ఆరు ర్యాంకింగ్ ఇవ్వ‌గ‌, శ్రీహాన్‌ ప్రస్తావన వచ్చినప్పుడు నాగ్‌ ఫైర్‌ అయ్యాడు.

అతను వరస్ట్ కెప్టెన్‌గా తేల్చాడు నరికేస్తా, పీకేస్తా అన్న శ్రీహాన్‌, అలా చేయలేదని, నరికేస్తా అన్నావ్‌, ఏం నరికినవో చెప్పు అంటూ గ‌ట్టిగా ఇచ్చేశాడు. నీ త‌ప్పుల‌కి ప‌నిష్మెంట్‌గా వ‌చ్చే వారం నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేద‌ని చెప్పుకొచ్చాడు నాగ్. ఇక ఇన‌య మాట్లాడిన మాట‌ల‌కి కూడా గ‌ట్టిగానే ఇచ్చేశాడు.

also read:

-Advertisement-

horoscope today : 6-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News