Homebigg boss telugu season 6Bigg Boss 6 telugu : రేవంత్‌ని ప‌ప్పు అంటూ తిట్టేసిన నాగార్జున‌

Bigg Boss 6 telugu : రేవంత్‌ని ప‌ప్పు అంటూ తిట్టేసిన నాగార్జున‌

Telugu Flash News

బిగ్ బాస్ సీజ‌న్ 6 (Bigg Boss 6 telugu)కార్య‌క్ర‌మం సంద‌డిగా సాగుతున్న విష‌యం తెలిసిందే. మిగ‌తా రోజుల మాటేమో గాని, శ‌ని, ఆది వారాల‌లో నాగార్జున దుమ్ము రేపుతున్నాడు. తాజా ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్ ప్ర‌కారం చివరకు హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఏంది..? ఎవరికి లేదు..? ఎవరు ఇంప్రూ చేసుకోవాలి అనేది చెప్పాల‌న్నారు. శ‌నివారం ఎపిసోడ్ మొత్తం దానిపైనే న‌డిచింది. అయితే హౌస్ లో ఉండేందుకు అర్హుడు శ్రీహాన్ అని ఆయ‌న‌కు ఎక్కువ ఓట్లు వేశారు కంటెస్టెంట్స్. ఇక హౌస్ లో ఉండే అర్హత మేరీనాకు లేద‌ని ఎక్కువ‌ ఓట్లు పడ్డాయి.

పప్పు.. ప‌ప్పు

revanth in Bigg Boss 6 teluguపదమూడు మంది ఉన్న హౌస్ లో దాదాపు తొమ్మిది మంది మెరీనాకు వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించిది.మెరీనాతో స‌న్నిహితంగా ఉండే ఇనాయా, ఫైమ లాంటి వారు కూడా మెరీనాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక శ్రీహాన్ త‌ర్వాత హౌజ్‌లో ఉండేందుకు ఎవ‌రికి అర్హ‌త ఉంది అనేది చూస్తే.. రేవంత్, సూర్య, గీతూలు త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీహాన్ కు అత్యధికంగా 9 ఓట్లు పడ్డాయి. శ్రీహాన్ కు బద్ద శత్రువుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఇనయా కూడా సూర్యను వదిలేసి శ్రీహాన్ కు ఓట్ వేసింది. ఇక అనర్హుల లిస్ట్ లో మెరీనాతో పాటు వాసంతి, రాజ్, అర్జున్ కల్యాణ్ కూడా లిస్ట్ లో ఉన్నారు.

అనర్హులకు ప్రత్యేకంగా బ్యాడ్జ్ లు అందించిన నాగార్జున‌..ఆట తీరు ఇంకా మెరుగుప‌ర‌చుకొని నెక్ట్స్ వీక్ వరకూ ఇంప్రూ అవ్వాలని తెలిపారు. ఇక రేవంత్, అర్జున్, శ్రీసత్యల మధ్య జరిగిన పప్పు కాంట్రవర్సీపై కొద్ది సేపు మాట్లాడాడు నాగ్.. ఎవరు మాట తూలారు.. ఎలా రియాక్ట్ అయ్యారు అనేది బేస్ చేసుకుని.. క్లాస్ పీకిన నాగార్జున‌.. అర్జున్ క‌ళ్యాణ్ ఇంకా గేమ్ ఆడాలి అంటూ సూచ‌న‌లు చేశాడు. అర్జున్ కళ్యణ్ సొంత స్టాండ్ తీసుకోకపోవడంపై కూడా పెద్ద చ‌ర్చే న‌డిచింది.. ఇక ఈ రోజు దివాళీ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు బిగ్ బాస్ మేకర్స్. సెలబ్రిటీ తారల ఆటపాటలు, సినిమా ప్రమోషన్లతో ఈ రోజు బిగ్ బాస్ షో సంద‌డిగా సాగనుంది. సాయంత్రం 6 గంటల నుంచే బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ కానుండ‌గా, ఈ రోజు ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

ఇవి కూడా చదవండి :

దీపావళి పండక్కి ఏం కొంటే శుభం కలుగుతుందో తెలుసా ?

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News