Homebigg boss telugu season 6Bigg Boss 6: ఆర్ జే సూర్య ఎలిమినేట్ ? కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్.. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది ?

Bigg Boss 6: ఆర్ జే సూర్య ఎలిమినేట్ ? కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్.. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగింది ?

Telugu Flash News

Bigg Boss 6: శ‌నివారం వ‌చ్చిందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గుండెల్లో ద‌డ మొద‌ల‌వుతుంది. నాగార్జున ఎవ‌రికి ఏ పాయింట్ మీద క్లాస్ పీకుతాడా అని టెన్ష‌న్ ప‌డుతుంటారు.

తాజా ఎపిసోడ్‌లో గీతూని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. ప్ర‌తీ వారం ఏం చేసినా గీతును వదిలేస్తూ.. వచ్చాడు, కాని ఈసారి మాత్రం ఈ అమ్మ‌డ‌కి ఫుల్ క్లాస్ పీకాడు.. అసలు సంచాలక్ అయిన నువ్వు గేమ్ ఆడటం ఏంటీ..? అసలు నీ ఆట ఏది అక్కడ. ఇచ్చిపడేస్తానన్నావ్ ఇదేనా..? అంటూ గీతూని ఎండ‌క‌ట్ట‌డంతో ఈ అమ్మడు సైలెంట్‌గా ఉండిపోయింది.

geetu in bigg boss 6అయితే ఆమె చేసిన త‌ప్పుల‌కి గాను నాగార్జున గీతూకి శిక్ష వేయ‌మ‌ని కెప్టెన్ శ్రీహాన్‌కి చెప్పాడు. అత‌ను గిన్నెలు క‌డ‌గ‌మంటే క‌డ‌గ‌లేన‌ని అంది.

ఇచ్చి ప‌డేశాడుగా..

దాంతో బాత్‌రూమ్స్ క‌డగాల‌ని చెప్ప‌డంతో ఓకే చెప్పింది.ఇక ఇక రేవంత్ ను కూడా ఇదే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన నాగ్..ఆయన ఎంత‌గా అగ్రెసివ్ అవుతున్నాడో చూపించాడు.

టాస్క్ లో భాగంగా లేడీస్ ను నెట్టేయడం గురించి మాట్లాడుతూ.. అది ఏదో ఆటలో తెలియక  నెట్టినట్టు లేదు. కావాలని నెట్టినట్టు ఉంది. ఒక ఉన్మాదిలా ఆడావంటూ.. రేవంత్ పై కూడా ఫైర్ అయ్యాడు నాగ్.

ఇక మిగతా వాళ్లకు కూడా అంతో ఇంతో ఇదే రేంజ్ లో పడింది. ఒక ఫెమినిస్ట్ ను అన్నావ్ సూర్య ఇదేనా నీ ఆట అంటూ.. వాసంతీకి అన్యాయం చేసిన విషయంలో గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు.

-Advertisement-

హౌస్ లో ఎప్పటికప్పుడు కామెడీతో నవ్విస్తున్న ఫైమాకు..ఒక్కోసారి కామెడీ ఎక్కువైతే ప్రమాదం.. అతి చేయవద్దు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చాడు.

చివ‌ర‌లో ఈసారి హౌస్ అంతా ఎలిమినేషన్ లో ఉండగా.. సేవ్ చేయడం లాంటివి ఏమీ లేవు డైరెక్ట్ ఎలిమినేషనే అని నాగార్జున చెప్పారు.

ఇక ఎవరూ ఊహించని విధంగా ఆర్ జే సూర్య ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టిస్తూ హౌస్ నుంచి బయటకు వచ్చేయాలని అన్నాడు నాగ్. అయితే సూర్య ఎలిమినేట్ అయినట్టు  చెప్ప‌గానే ఇన‌య‌, కీర్తి, ఫైమా తెగ ఏడ్చారు. ఇక ఇన‌య ఓవరాక్ష‌న్‌ని ఏ మాత్రం త‌ట్టుకోలేక‌పోయాం.

అయితే అత‌డు ఎలిమినేట్ అయి ఉండ‌డు అని అంద‌రు భావిస్తున్నారు. సీక్రేట్ రూమ్ లోకి తీసుకెళ్లారు అని భావిస్తుండ‌గా, నేటి ఎపిసోడ్‌లో దీనిపై క్లారిటీ రానుంది.

మరిన్ని వార్తలు చదవండి :

horoscope today : 30-10-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Viral Video: క‌దిలే కారుపై ట‌పాసుల మోత‌.. ఉలిక్కిప‌డ్డ జ‌నం

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News