Bigg Boss Telugu 6 : శనివారం రోజు హౌజ్‌మేట్స్‌కి గుండెల్లో వణుకు పుడుతుంది. తాము ఏం చేశామో, నాగార్జున ఏమంటారో అనే టెన్షన్ వాళ్లలో కనిపిస్తుంది. శనివారం నాటి 21వ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది.
శ్రీసత్యకి పులిహోర కలిపే క్రమంలో ఆమె అర్జున్‌కళ్యాణ్‌పై మండిపడింది. నాపై చేయి వేయకు.. చేయి వేయకుండా మాట్లాడు అంటూ మండిపడింది. నేను చిరాకులో ఉన్నప్పుడు నన్ను ముట్టుకుంటే చిరాకు వస్తుంది అని నానా రచ్చ చేసింది శ్రీసత్య.
అనంతరం సింగర్ రేవంత్.. గీతు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తల్లి ప్రేమ కంటే కుక్క ప్రేమ గొప్పదట.. అసలు ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారోఇలాంటి వాళ్లతో కలిసి గేమ్ ఆడుతున్నందుకు బాధగా ఉందన్నాడు రేవంత్.
పంచ్ అదిరింది..
ఆది రెడ్డి దగ్గర కూర్చుని నాకు నోటి దూల ఉందా? అని గీతై అడగగా, జైలులో ఉన్న అర్జున్.. ఉంది కదా అని మొహమాటం లేకుండా చెప్పాడు. అయితే తనది కాదని, ఇనయది అంటూ కవరింగ్ ఇచ్చుకుంది. పక్కనే ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్ లు ఆమెకు లేదని చెప్పుకొచ్చారు.
ఈ వీక్ ఆటతీరుకు సంబంధించి శ్రీహాన్, శ్రీ సత్యలను అభినందించిన రాగార్జున , ఆటతీరులో వెనుకబడ్డ శ్రీరాజ్, చంటీ, అర్జున్ కల్యాణ్ లను సోఫా వెనక్కి పంపి క్లాస్ పీకాడు. ఆట తీరులో గీతూ, ఆదిరెడ్డి,శ్రీ సత్యలు 10 మార్కులు తెచ్చుకుని టాప్ లో నిలిచారని ప్రశంసించాడు.
కొద్ది సేపు రొమాంటిక్ సంగతుల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఫోటోస్ తో సహా.. సూర్య, ఆరోహిల ప్రేమ కథలు వినిపించాడు. మరో వైపు అర్జున్ కల్యాణ్ శ్రీసత్య కోసం బాగా ట్రై చేస్తుననాడంటూ.. ఆడియన్స్ తో చెప్పించాడు నాగ్.
దారితప్పుతున్న హౌజ్ మేట్స్‌కి కాస్త చురకలు అంటించాడు. కింగ్.. శ్రీహాన్ పిట్ట కథతో పాటు.. ఇనాయా వాడు అనే వాడుక పదం.. రేవంత్ టెంపర్.. సుధీప మనిషి అయితే అన్న మాట వరకూ ప్రతి ఒక్క విషయంపై క్లారిటీ ఇస్తూ వారి పొరపాట్ల గురించి వారికి తెలిసేలా చేశాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ కాస్త సందడిగా, కాస్త గరంగరంగా సాగింది.