Homebigg boss telugu season 6Bigg Boss Telugu Season 6: ఆదిరెడ్డి పై నాగార్జున ఫైర్..

Bigg Boss Telugu Season 6: ఆదిరెడ్డి పై నాగార్జున ఫైర్..

Telugu Flash News

Bigg Boss Telugu Season 6:  శ‌నివారం వ‌చ్చిందంటే హౌజ్‌మేట్స్ గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతుంటాయి. నాగార్జున ఎవరిపై ఏ విధంగా ఫైర్ అవుతాడా అని ప్ర‌తి ఒక్క‌రు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే హౌజ్ మెంబర్స్ తగ్గే కొద్ది.. గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా మారుతుందన‌డంలో సందేహం లేదు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున‌తో క్లాస్ పీకుంచుకోని ఆదిరెడ్డి తాజా ఎపిసోడ్‌లో అది కూడా పూర్తి చేసుకున్నాడు. ఆదిరెడ్డి చేస్తున్న పనులను ఒక్కొక్కటిగా వివరిస్తూ..స‌ప‌రేట్‌గా క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఈసారి గేమ్ బాగా ఆడావంటూ రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తిన నాగ్.. ఆదిరెడ్డికి మాత్రం గ‌ట్టిగానే క్లాస్ పీకాడు.

ఊరికే డోర్లు తెరిస్తే వెల్లిపోతాను అంటున్నావు.. జనాలకు చిరాకు పుడితే గేట్లు తీసుకుని లోపలికి వచ్చి వాళ్లే నిన్ను బయటకు పంపిస్తారు.. బిగ్ బాస్ ఆటకే వంకలు పెట్టడం.. ప్రీ ఎవిక్షన్ పాస్ వేస్ట్ అనడానికి నువ్వు ఎవరు ఆదిరెడ్డి.. నువ్వేమైన తోపు తురుము అనుకుంటున్నావా అంటూ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు. ఆదిరెడ్డి మాట్లాడిన మాటలు, లేడీస్ ను కించపరచడం, రేవంత్ అనని మాటలను అన్నట్టు చెప్పడం లాంటివి వీడియో ఫ్రూప్స్ తో సహా చూపించి గట్టిగా ఇచ్చేశాడు. ఇక శ్రీహాన్ అంత బరువును చివరి వరకూ మోయడం చాలా కష్టం.. అయినా అంత‌సేపు నువ్వు త‌ట్టుకున్నావు గ్రేట్ అంటూ శ్రీహాన్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున.

ఇక శివంగిలా ఆడి పాస్ గెలిచిన ఫైమాకు విషెస్ అందించాడు నాగ్. అనంత‌రం పగిలిపోయిన గ్లాస్ విషయంలో ఇనయాకు కూడా నవ్వుతూనే క్లాస్ ఇచ్చాడు . ఇక శనివారంనామినేషన్స్ లో ఉన్న శ్రీహాన్ తో పాటు ఆదిరెడ్డిని సేవ్ చేశాడు నాగ్. అయితే బ‌య‌ట ఆడియ‌న్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి ఎలాంటి మీమ్స్ చేస్తున్నారో వాటిలో పాపుల‌ర్ అయిన కొన్నింటిని బ్యాడ్జ్‌లుగా తెచ్చారు నాగ్. అవి ఎవ‌రికి స‌రిపోతాయో చెప్ప‌మ‌ని అడ‌గ్గా, శ్రీహాన్‌కి ఎక్కువ వ‌చ్చాయి. ఓరి వీడి వేశాలు, చాలానే ఉన్నాయి కాస్త తగ్గించుకుంటే మంచిది. నీలో రకరాల శేడ్స్ ఉన్నాయి లాంటి కార్డ్స్ శ్రీహాన్ కి ఇచ్చారు.

also read news:

20-11-2022 ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News