Telugu Flash News

bigg boss telugu 6 : మెగాస్టార్ చిరంజీవి పాట‌కు నాగార్జున డాన్స్.. వీడియో వైరల్

bigg boss telugu 6 : అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు స్టార్ హీరోలే కాదు మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న గాడ్‌ఫాదర్‌, నాగార్జున కథానాయకుడిగా నటించిన ghost అక్టోబర్‌ 5న థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో నాగ్, చిరు ఇప్పటికే తమ టీమ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 (bigg boss telugu season 6)కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి గాడ్ ఫాదర్ నుండి విడుదలైన థార్ మార్ థక్కర్ మార్ నెట్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఆ పాటకు నాగార్జున స్టెప్పులేశాడు. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేసిన ప్రోమో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా..ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరోవైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లు సాధిస్తాయో చూడాలి.

Exit mobile version