Nagarjuna: ఒకప్పుడు మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా ఉండే నాగ చైతన్య, సమంత కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంటని చూసి చూడ ముచ్చటైన జంట అని అందరు ప్రశంసలు కురిపించారు. సమంత, నాగ చైతన్య జంటగా కనిపిస్తే వారిని చూసి అభిమానులు తెగ మురిసిపోయారు.
అయితే ఈ జంటకి దిష్టి తగిలిందేమో ఏమో కాని పెళ్లై నాలుగు సంవత్సరాలు కూడా కాక ముందే విడాకులు తీసుకున్నారు. ఈ నిర్ణయం కుటుంబ సభ్యులనే కాకుండా ప్రతి ఒక్కరిని బాధించింది.
సమంత,నాగ చైతన్య విడాకులపై స్పందన..
అనుకోని విధంగా విభేదాలు తలెత్తడంతో చైతు, సమంత విడిపోవాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే విభేదాలు ఎందుకు వచ్చాయనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. సమంత, నాగ చైతన్య, నాగార్జున మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా వారికి విడాకుల అంశంపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఎంత సైలెంట్ మైంటైన్ చేస్తున్నా కొన్ని సార్లు వారు స్పందించక తప్పడం లేదు. నాగార్జున రీసెంట్గా బ్రహ్మాస్త్ర సినిమాలో నటించగా, ఈ సినమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ క్రమంలో నాగార్జునకి నాగ చైతన్య, సమంత విడాకులకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. చైతూ ఇటీవల ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు, ఇది మీకు బాధగా అనిపించడం లేదా అని రిపోర్టర్ ప్రశ్నించాడు.
దీనికి స్పందించన నాగ్.. ప్రస్తుతం అతను సంతోషంగా ఉన్నాడు. వాడు సంతోషంగా ఉండడం మాకు కావాలి. దురదృష్టవశాత్తు మా జీవితాల నుండి తాను వెళ్లి పోయింది. ఎవరి జీవితంలో అయిన ఇలాంటివి జరిగితే వెంటనే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అని నాగ్ స్పష్టం చేశారు.
కాగా, నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతుండగా , సమంత యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో త్వరలో ప్రేక్షకులని పలకరించనుంది.
మరిన్ని వార్తలు చదవండి :
Pushpa: పుష్ప సామీ సామీ పాటకు చిన్నారి డ్యాన్స్.. పగలబడి నవ్విన సూర్య
Samantha: కోట్లు సంపాదిస్తున్న సమంత ఆ డబ్బులని వేటికి ఎక్కువ ఉపయోగిస్తుందో తెలుసా?