Telugu Flash News

#NagaChaitanya సమంత ఎదురుపడితే హగ్ చేసుకుంటానన్న నాగ చైతన్య

నాగ చైతన్యతో ఒకే గదిలో ఒంటరిగా ఉంటే ఏం చేస్తావు? కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సమంతను అడిగిన ప్రశ్న ఇది. దీనికి సమంత పదునైన ఆయుధాలు ఉండకూడదని సమాధానమిచ్చింది. అందుకే వారి మధ్య అంత గ్యాప్ ఉందని ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి ప్రశ్న ఎదురైన నాగ చైతన్య తన సమాధానంతో సమంత అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాడు.

తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య.. సమంతను కలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ.. హాయ్ చెప్పి కౌగిలించుకొంటాను అని అన్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్య 2017 అక్టోబర్‌లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టు ప్రకటించారు.

నాగ చైతన్య తన చేతిపై పెళ్లి తేదీని కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నాడు. అది తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “ఈ మద్య కొందరు అభిమానులను కలిశాను. ఆ సందర్భంగా నాలాగే  వారి చేతిపై టాటూ వేయించుకోవడం చూశాను. అది నా పెళ్లి తేదీ. కాబట్టి అభిమానులు దానిని అనుసరించద్దు” అని చెప్పాడు.

మరిన్ని వార్తలు చదవండి

Laal Singh Chaddha : బ్యాడ్ రివ్యూ ఇస్తే సినిమా 100 కోట్లు రాబట్టడం కష్టమే 

Rashmika Mandanna : నాగ చైతన్య తో రష్మిక రొమాన్స్..

 

Exit mobile version