Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగ చైతన్య చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. 2010 లో వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో సమంతతో ప్రేమలో పడ్డ ఇతగాడు 2017 లోఆమెని వివాహం చేసుకున్నాడు.
దాదాపు మూడేళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగిన ఏవో మనస్పర్ధల వలన 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. ఏ కారణంతో విడిపోయారనే విషయం ఇప్పటికి మిస్టరీనే. ఇక విడాకుల అనంతరం చై, సామ్ తమ తమ సినిమాలతో బిజీ అయిపోగా, వారికి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి నిత్యం హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
రూమర్ నిజమేనా?
ఇటీవల నాగ చైతన్య తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. సమంతతో విడాకుల తర్వాత చైతూ జూబ్లీ హిల్స్‌లోని తన కొత్త ఇంటిలోకి మారాలని అనుకున్నాడట.
ఆ సమయంలో శోభిత, నాగ చైతన్య కలిసి కనిపించడంతో పుకార్లు మరింత పెరిగాయి. ఇక మేజర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా శోభితను కలవడానికి చైతన్య పలుమార్లు వెళ్లాడని, ఇద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయతే శోభిత – నాగ చైతన్య ఎఫైర్‌కి సంబంధించి జోరుగా ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలో శోభిత స్పందించింది. అది కూడా అలా ఇలా కాదు.. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో పోస్ట్ చేసి గాసిప్ రాయుళ్లకి గట్టిగా బుద్దోచ్చేలా చేసింది. దీంతో కాస్త శాంతించారు.
అయితే తాజాగా శోభిత మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న పోనియన్ సెల్వన్ సినిమాల్లో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.ఆమె పాత్రకు సంబంధించి పోస్టర్ ఒకటి విడుదల కాగా, దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి నాగ చైతన్య లైక్ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య నడుస్తుంది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.