Naga Chaitanya: సమంతని ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య.. పరస్పర సమ్మతితో వివాహ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. సమంతే నాగచైతన్యని వద్దనుకుందో.. లేదంటే.. నాగ చైతన్యే కాదనుకున్నాడో కానీ.. కారణం ఏదైతేనే ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకొని సోలో జీవితం గడుపుతున్నారు.
అయితే విడాకుల తర్వాత ఇద్దరికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. . ఆ మధ్య నటి శోభిత దూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత మజిలీ సెకండ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో చైతూ ప్రేమాయణం నడిపినట్లు రూమర్లు వచ్చాయి.
త్వరలోనే చైతూ, దివ్యాంశ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై మజిలీ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చైతూతో పెళ్లి విషయంపై స్పందించారు.
ఐ లవ్ నాగచైతన్య, మంచి వ్యక్తి అని, చైతూపై తనకు క్రష్ ఉందని, చాలా బాగుంటాడని ఆమె చెప్పింది. చైతూ తనకు సీనియర్ అని.. సెట్స్ లోకి వచ్చినప్పుడు కుర్చీలోంచి లేచి గౌరవిస్తానని ,. హీరో గారు దయచేసి కూర్చోండి అని అంటే.. ఇడియట్ కూర్చో అని చైతూ అంటారని ఆమె గుర్తు చేసింది.
also read :
heart healthy foods : గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..
Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..