HomecinemaNaga Chaitanya: కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించిన చైతూ..

Naga Chaitanya: కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించిన చైతూ..

Telugu Flash News

Naga Chaitanya: అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైతన్య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి రీసెంట్ గా గృహప్రవేశం చేసినట్లు సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తుంది. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా సింపుల్ గా చైతు తన కొత్త ఇంట్లోకి ప్రవేశించాడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని భావించాడు. ఈ క్ర‌మంలోనే నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్న‌ట్టు తెలుస్తుంది.

ల‌గ్జరీ హౌజ్‌లో స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ ఉండేలా విలాసవంతమైన ఇంటిని డిజైన్ చేసుకున్నాడు. రీసెంట్‌గానే ఆ ఇంట్లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు చైతూ హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన న‌టిస్తున్న కస్టడీ టీజర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

also read :

Naatu Naatu Song : ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు డ్యాన్స్‌ అదరగొట్టిన మాజీ క్రికెటర్లు!

South Korea : వామ్మో పెళ్లా.. మాకొద్దు బాబోయ్‌.. దక్షిణ కొరియాలో వింత పరిస్థితి..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News