Telugu Flash News

Naga Chaitanya – sobhita : లండ‌న్‌లో శోభిత‌తో డిన్న‌ర్ డేట్.. అంద‌రిలో మెదులుతున్న అనేక ప్రశ్న‌లు

Naga Chaitanya – sobhita: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోయి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా కూడా ఇప్ప‌టికి వీరికి సంబంధించి ఎన్నో వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సమంతతో విడిపోయిన కొద్ది నెలలకే అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు పుట్టుకు రాగా, అందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు. యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాళని చైతూ రెగ్యూలర్ గా కలుస్తున్నారని, ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయం కూడా ఏర్పడిందంటూ ప్ర‌చారాలు సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో శోభితా – నాగ చైత‌న్య ఇద్ద‌రు క‌లిసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్టు ఓ ఫొటోని చూస్తే అర్ధ‌మ‌వుతుంది. వీరిద్దరూ ఒకే రెస్టారెంట్ లో ఉన్న ఆ ఫొటో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. శోభితా – చైతూ లండన్ లోని జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్టు తెలుస్తుండ‌గా, అక్కడి చెఫ్ సురేందర్ మోహన్.. నాగచైతన్యతో ఓ ఫొటోను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఫొటోలో వెనకాల టేబుల్ ముందు శోభితా కూర్చొని ఉండటం అందరి దృష్టిని ఆశ్చర్యపరిచింది. చైతన్య – శోభితా రిలేషన్ లో ఉన్నారనేందుకు ఈ ఫొటో సాక్ష్యం అంటూ ప‌లువురు చెప్పుకొస్తున్నారు.

also read :

Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023

sobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్

Exit mobile version