HomecinemaNaga Chaitanya:విడాకుల త‌ర్వాత తొలిసారి స‌మంత గురించి మాట్లాడిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya:విడాకుల త‌ర్వాత తొలిసారి స‌మంత గురించి మాట్లాడిన నాగ చైత‌న్య‌

Telugu Flash News

Naga Chaitanya: తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అయ్యింది. విడిపోయిన తర్వాత కూడా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే నాగ చైతన్య క‌స్ట‌డీ మూవీ ఈ నెల 12న రిలీజ్ కాబోతుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు గురించి కూడా మాట్లాడాడు చైతూ. మేము విడాకులు తీసుకొని రెండేళ్లు పూర్తైంది. చట్టప్రకారం అయితే ఏడాది గడిచింది. న్యాయస్థానం మాకు విడాకులు కూడా మంజూరు చేసింది. ప్రస్తుతం మేం ఇద్దరం మా కెరీర్స్‌పై దృష్టి పెట్టాం.

అయితే జీవితంలో ఎదురయ్యే ప్రతి దశ, సంఘటనను నేను ఎంతో గౌరవిస్తాను. స‌మంత చాలా మంచిది. ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటుంది.. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల‌ వల్లే మా మధ్య పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి.. మేం ఇద్దరం ఒకరికి ఒకరు గౌరవించుకోవడం లేదని.. ఇద్దరి మద్య డామినేషన్ కొనసాగుతుందని, మూడో వ్య‌క్తి మా మ‌ధ్య ఉన్నారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఇవ‌న్నీ మొద‌ట ప‌ట్టించుకోలేదు కాని ఇప్ప‌టికీ ఆ టాపిక్స్ తీస్తూనే ఉన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదంటూ చైతూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News