Telugu Flash News

Naga Babu : చిరుపై రోజా చేసిన కామెంట్స్‌కి గ‌ట్టిగా ఇచ్చేసిన నాగబాబు.. ఏమ‌న్నాడంటే..!

Naga Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి అడుగుపెట్టాడో అప్ప‌టి నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు మెగా హీరోల‌పై కూడా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. ఇటీవ‌ల రోజా మెగా బ్రదర్స్ పై ఏదో కామెంట్స్ చేయడం.. ఆమెపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వడం.. ఇలా ఓ వార్ లా జరుగుతూ వచ్చింది. అయితే.. మంత్రి రోజా ఇటీవ‌ల‌ జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాణ్, మెగాబ్రదర్ నాగబాబులపై కామెంట్స్ చేస్తూనే.. మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై చిరు మాట్లాడుతూ.. విమర్శించేవాళ్ళు ఉంటూనే ఉంటారని చెబుతూ లైట్ తీసుకున్నారు.

రీసెంట్‌గా వాల్తేరు వీర‌య్య స‌క్సెస్ మీట్‌లో రామ్ చ‌ర‌ణ్ అలాంటి మాట‌లు మాట్లాడే వారికి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేశాడు. తాజాగా రోజా కామెంట్స్ గురించి నాగబాబు మాట్లాడుతూ.. “అన్నయ్య ఎవరికీ చెడు చేసే వ్యక్తి కాదు. అయినా విమర్శిస్తూనే ఉంటారు. అన్నయ్య రెగ్యులర్ గా కోట్లరూపాయలు దానం చేస్తుంటారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాళ్లు తగులుతుంటాయి. విమర్శించేవాళ్ళు కూడా అంతే. రాళ్ల లాంటి వాళ్లే.. వాళ్ళని ఏమని తిడతాం” అని అన్నారు నాగ‌బాబు.

also read :

ఉక్రెయిన్‌ కు యుద్ధ విమానాలు సరఫరా నిలిపివేస్తున్నట్లు జో బైడెన్‌ సంచలన ప్రకటన

Varla Ramaiah : ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు.. ఏపీ సర్కార్‌పై టీడీపీ ఆరోపణలు

 

Exit mobile version