HomecinemaNaga Babu: చిరంజీవిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ‌రిక‌పాటి.. నాగ‌బాబు కౌంట‌ర్ ఏంటో తెలుసా?

Naga Babu: చిరంజీవిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ‌రిక‌పాటి.. నాగ‌బాబు కౌంట‌ర్ ఏంటో తెలుసా?

Telugu Flash News

Naga Babu: ఇటీవ‌లి కాలంలో చిరంజీవి అంద‌రి నోళ్ల‌ల్లో తెగ నానుతున్నారు. పాపులారిటీ పొందేందుకు కొంద‌రు కావాల‌నే చిరంజీవి పై నెగెటివ్‌కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా ద‌స‌రా వేడుక‌ల సందర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కుమార్తె, బీజేపీ నేత విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చిరంజీవి కూడా కార్య‌క్ర‌మంలో సంద‌డి చేయ‌గా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహారావు అస‌హ‌నంతో కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఇవి ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు కాని ఇప్పుడు ఈ విష‌యం ర‌చ్చ‌గా మారింది.

నాగబాబు ఫైర్..

అలయ్ బలయ్ కార్యక్రమంలోచిరంజీవి ప‌క్క‌న కూర్చున్న‌ గరికపాటి నర్సింహారావు మాట్లాడుతుండ‌గా… పలువురు మహిళలు, యువతులు వచ్చి వేదికపైనే ఉన్న చిరంజీవితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్ర‌మంలో తన ప్రసంగానికి విఘాతం కలగడంతో గరికపాటి కొంత అసహనాని గురై కొన్ని కామెంట్స్ చేశారు.

చిరంజీవి గారూ.. మీరో ఫొటో సెషన్ ఆపి ఇక్కడికి వస్తే.. తాను ప్రసంగం పూర్తి చేస్తానని.. లేదంటే ఇక్కడ్నుంచి వెళ్లిపోతానని అంటూ కూల్‌గా హెచ్చ‌రించారు. అయితే ఆ మాట త‌ర్వాత చిరంజీవి రావడం.. ఆయనను గరికపాటి తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రసంగం పూర్తి చేయడంతో అంతా కూల్‌గానే సాగింది.

అయితే కొంద‌రు మాత్రం చిరంజీవిని గ‌రిక‌పాటి అవ‌మానించారంటూ కామెంట్స్ చేయ‌డంతో నాగబాబు స్పందించారు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే..’ అంటూ నాగ‌బాబు త‌న ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన‌డంతో విష‌యం హాట్ టాపిక్గా మారింది.

-Advertisement-

అయితే ఈ పోస్ట్‌లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కాని, సోష‌ల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గరికపాటిని విమర్శించడం సరికాదని నాగబాబుకు హితవు పలుకుతుండ‌డం విశేషం.

ఇక చిరంజీవి న‌టించిన రీసెంట్ మూవీ గాడ్ ఫాద‌ర్ మంచి విజ‌యం సాధించి అందరి ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News