HomecinemaOscars - Naatu Naatu : ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న RRR

Oscars – Naatu Naatu : ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న RRR

Telugu Flash News

Oscars – Naatu Naatu : ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ‘RRR’ చిత్రం ఆస్కార్ నామినేషన్‌ను అందుకుంది. ‘నాటు నాటు’ 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ అందుకుంది.

కోట్లాది మంది భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ నామినేషన్ల జాబితా ఈరోజు బయటకు వచ్చింది. హాలీవుడ్ అవార్డ్స్ కోసం మన భారతీయ ప్రేక్షకులు ఇంతగా ఎదురుచూడడానికి కారణం RRR సినిమాకు ఆస్కార్ నామినేషన్లు వస్తాయని ప్రచారం జరగడమే.. అందరూ అనుకుంటున్నట్టు గానే ఈ సినిమా ఆస్కార్ లో నామినేట్ అయ్యింది . RRR చిత్రానికి చోటు దక్కగా.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నాటు నాటు’ పాట బెస్ట్ ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నామినేషన్ పొందింది.

naatu naatu song nominated in oscars
naatu naatu song nominated in oscars

నాటు నాటు పాట ఇటీవల ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును గెలుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు.. ఇప్పుడు ఇదే పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం ప్రతి భారతీయుడు ఎంతో గర్విస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి పలు విభాగాల్లో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని.. ఉత్తమ విదేశీ చిత్రంగా #RRR నామినేట్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News