ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్ (Naatu Naatu Song) కు ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు (oscar award) రావడంతో ఈ సినిమాపైన, ఆ పాటపైనా ప్రపంచ వ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. ఎక్కడ చూసినా ఈ పాటకు స్టెప్పులేస్తున్న చిత్రాలే దర్శనమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు పాట ఫోబియాలా పట్టుకుంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీలు, ప్రముఖుల వరకు నాటు నాటు స్టెప్పులు వేస్తూ అలరిస్తున్నారు. తాజాగా టీమిండియా విశ్రాంత ఆటగాళ్లు ఇద్దరు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లెజెండ్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టు ఆటగాళ్లు ఇద్దరు నాటు నాటు పాటకు కాలు కదిపారు.
హర్బజన్ సింగ్(harbhajan singh), సురేష్ రైనా (suresh raina) ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో ఈ సీఎస్కే మాజీ క్రికెటర్లను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఒకరిని రామ్ చరణ్, మరొకరిని జూనియర్ ఎన్టీఆర్‌లతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్టెప్పులు అదరహో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను విపరీతంగా షేర్లు, లైకులు చేస్తున్నారు.
ఇక ఇండియా మహారాజాస్ జట్టుకు హర్బజన్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గంభీర్ గైర్హాజరుతో భజ్జీకి బాధ్యతలు అప్పగించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇండియా మహారాజాస్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో నెగ్గి ఒక మ్యాచ్‌లో పరాజయాన్నిచవిచూసింది. ఇక వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు నమోదు చేసింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆసియా లయన్స్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని చవిచూసింది. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గురువారం వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
also read :
Prabhas: చికిత్స కోసం ఫారిన్‌కి పయనమైన ప్రభాస్… అసలేమైంది..!
Chiranjeevi: ఎంత గొప్ప మనసు.. తమిళ విలన్ ఆరోగ్యం కోసం రూ.45లక్షలు ఖర్చు చేసిన చిరంజీవి