మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. ‘శ్రీమంతుడు’ సినిమాతో మొదలైన ప్రస్థానం ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో ఎన్నో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. దీంతో నిర్మాతలు కూడా చాలా విజయాలు సాధించి కోట్లలో లాభాలు పొందుతున్నారు.
మంచి అభిరుచి ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవలే పంపిణీని ప్రారంభించింది. గత సంక్రాంతికి థియేటర్లలో వివాదం చెలరేగినప్పుడు, ఈ సంస్థ వారు నిర్మించిన ‘వీరసింహా రెడ్డి’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను విజయవంతంగా విడుదల చేసింది. ఈ రెండూ హిట్ అయ్యి భారీ వసూళ్లను అందుకున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నా అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగలడం మామూలే. అయితే సాఫీగా సాగే ప్రయాణాన్ని ముళ్ల మార్గంగా మార్చేందుకు కొన్ని తప్పులు చేస్తే చాలు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అనవసర ప్రయోగాలు చేసి మంచి పేరు పోగొట్టుకోవడం కూడా నష్టాలను చవిచూస్తోంది.
ఆ మధ్య వరుస హిట్లు కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో భారీ నష్టాలను చవిచూసింది. కానీ ఈ సినిమా మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వారు విడుదల చేసిన ‘మీటర్’ భారీ నష్టాలను మిగిల్చింది. అదే సమయంలో ఈ సంస్థ కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘సత్తిగాని రెండెకరాలు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి కూడా ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. ఈ అనవసర తప్పిదాల వల్ల కంపెనీ పరువు పోయింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పరువు, డబ్బు పరంగా మరింత నష్టపోయే అవకాశం ఉంది.
read more news :
Bala Krishna : బాలయ్య చేతిలో శ్రీలీల తన్నులు తిన్నదా.. ఇందులో నిజమెంత?