Telugu Flash News

alia bhatt – ranbir kapoor marriage : మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది : ఆలియా

alia bhatt ranbir kapoor marriage

alia bhatt ranbir kapoor marriage

 

సినీ ప్రేక్షకులకు సెలబ్రిటీల ప్రేమ,పెళ్లి ముచ్చట్లు వింటుంటే సరదాగా ఉంటుంది. వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు జనాలు. హీరో హీరోయిన్ ఎక్కడ కనిపించిన వారి గురించే మాట్లాడుకోవడం, లవ్ ట్రాక్ వార్తలు రావడం సహజం. అయితే అపుడప్పుడు అవే నిజం అవుతాయి.
బాలీవుడ్ హాట్ కపుల్ ఆలియా(alia bhatt) రణబీర్ (ranbir kapoor) విషయం లో అదే నిజమయ్యింది. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రేమికులు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా ఆలియా ఒక ఇంటర్వ్యూ లో తన పెళ్లి (marriage ) విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

2020లోనే జరగాల్సిన రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌ పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తర్వాత 2021 డిసెంబర్ లో అనుకున్నారు కానీ కెరీర్ లో ఇద్దరు బిజీ గా ఉండడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. మళ్ళీ వీరి పెళ్లి ఎప్పుడా అన్నీ జనాల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి మ్యాటర్‌పై ఆలియా రియాక్ట్ అయింది.

బాలీవుడ్ సినిమా ‘గంగూబాయ్‌ కతియావాడి’ లో నటించిన ఆలియా భట్.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తొలిసారి తన పెళ్లి గురించి స్పందించింది. మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా రోజుల క్రితమే అతన్ని పెళ్లి చేసుకున్నట్లు మైండ్‌లో ఫిక్సయిపోయానని కామెంట్ చేసింది ఆలియా. తన పెళ్లి అప్పుడు వాయిదా పడింది. కానీ ఎప్పుడు జరిగినా ఎంతో అందంగా జరుగుతుందని ఆలియా చెప్పింది.

ప్రస్తుతం ఆలియా భట్ RRR సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘సీత’ పాత్రలో ఆమె నటిస్తుంది. . అలాగే ఎన్టీఆర్ సరసన మరో తెలుగు సినిమాకు ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Exit mobile version