Homecinemaచై సామ్ విడాకులపై మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్

చై సామ్ విడాకులపై మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్

Telugu Flash News

నాగ చైతన్య, సమంతల పెళ్లి జరిగినప్పటి నుండి చాలా మంది వారి అన్యోన్యత గురించి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. తమ దాంపత్యం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా సాగాలని వారంతా కోరుకున్నారు. అయితే ఏం జరిగిందంటే.. సామ్, నాగ చైతన్య అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

వారి విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు, చాలా మంది అది పుకార్లు అని అనుకున్నారు. అయితే వారే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో నమ్మడం కష్టంగా అనిపించింది. ఇద్దరి అన్యోన్యత కారణంగా విడాకుల వార్తను ఎవ్వరూ  జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ కూడా ఈ వార్తలను నమ్మలేకపోతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ… నాగ చైతన్య సమంత కోసం నేను కట్టుకున్న  ఇల్లు నాగార్జున అడిగినందుకు ఇచ్చాను. ఆ ఇంట్లో నాగ చైతన్య, సమంత ఉన్నారు. వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఎప్పుడూ కలిసి జిమ్ చేసేవారు.. చాలా సంతోషంగా కనిపిస్తారు.

వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరిగినట్లు కనిపించడం లేదు. వాళ్లు గొడవ పడ్డట్టు  పక్కింట్లో ఉండే  మాకు కూడా తెలియదు. వాళ్ళు విడిపోయారని తెలిసి షాక్ అయ్యాను. నాకే కాదు మా కుటుంబం కూడా షాక్ అయ్యిందని.. విడాకుల విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని మురళీమోహన్ పేర్కొన్నారు.

గొడవలు లేకపోతే ఎందుకు విడిపోయారంటూ నాగ చైతన్య, సమంత అభిమానులు మురళీమోహన్‌ని ప్రశ్నిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య పెద్దగా గొడవలేమీ లేవని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా, ఎవరూ విడిపోవాలని కోరుకోరు. కానీ వారి ఇష్టానుసారం విడిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి అందరూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే బాగుంటుందని అక్కినేని కుటుంబ సన్నిహితులు, అభిమానుల అభిప్రాయం.

-Advertisement-

మరిన్ని వార్తలు చదవండి :

Ponniyin Selvan : వివాదంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం

కాఫీ విత్ కరణ్ షో లో సమంత తన బ్రేకప్ గురించి ఏం చెప్పింది..

ప్రభాస్ ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News