MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని చెంతకు ఆస్కార్ చేరింది. మైదానంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే ధోని నైపుణ్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. మైదానం వెలుపల కూడా ధోని శైలి ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా సినిమా హీరోలకు గౌరవం, ప్రేమను పంచడంలో ధోని ముందుంటాడు. తాజాగా ఇలాంటి ఓ ఘటన వెలుగుచూసింది. ఏనుగులను కాపాడే బోమన్, బెయిలీలను మహేంద్ర సింగ్ ధోని గౌరవించాడు.
అంతేకాదు.. ధోని జెర్సీ నంబర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులారిటీ కలిగింది. ఈ జెర్సీని ఆస్కార్ విజేత దర్శకుడు కార్తీకి గోన్సాల్వేస్‌కు బహుమతిగా ధోని అందజేశాడు. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తన ప్రాక్టీస్ ముగిశాక మహేంద్ర సింగ్ ధోని వద్దకు వీరు చేరుకున్నారు.
దీంతో తన జెర్సీని వీరికి అందించాడు. అంతేనా..చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వీరి కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఆస్కార్ విన్నింగ్ ఎలిఫెంట్ విస్పర్స్ డైరెక్టర్, ఏనుగు సంరక్షకులు పాల్గొన్నారు.
ధోని సెవెన్ నంబర్ జెర్సీని బహుమతిగా అందించి వీరందరినీ సత్కరించాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వారికి జ్ఞాపికలు కూడా అందజేశారు. ఏనుగుల సంరక్షణ కోసం ముదుమలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్‌కు కూడా సీఎస్‌కే ఓ చెక్కును అందజేసింది.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ ధోని చేతికి ఆస్కార్ అందించడంతో అక్కడ ఆసక్తికర సీన్ కనిపించింది. ఆస్కార్ విన్నర్ డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పర్‌లో, బొమన్, బెయిలీ రఘు అనే అనాథ ఏనుగును చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఏనుగు గాయానికి వారు వైద్యం చేస్తారు.
Tudumm 🎬 Special occasion with very special people 💛🐘#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/AippVaY6IO
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
అనంతరం ఏనుగును కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటారు. అయితే, ఈ టాస్క్‌లో బౌమన్, బెయిలీ ఎలా విజయం సాధించారనేది డాక్యుమెంటరీలో చాలా చక్కగా వివరించారు. ధోని చేతికి ఆస్కార్ అందించడంతో మహేంద్రుడు సంబరపడ్డాడు. ఇండియాకు ధోని సారథ్యంలో వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారత జట్టు ధోని కెప్టెన్సీలో ఓ వెలుగు వెలిగిందనడంలో సందేహం లేదు.
Read Also : indian currency : మన కరెన్సీ ముద్రించడానికయ్యే ఖర్చెంతో తెలుసా?